సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు, డ్యాన్సర్ కన్నుమూత!

ఈ ఏడాది చిత్ర పరిశ్రమకు అస్సలు కలిసి రాలేదు.. ఈ వెడ్డింగ్ సీజన్‌లో కొద్ది రోజులుగా సెలబ్రిటీల నిశ్చితార్థాలు, వివాహాలకు సంబంధించిన వార్తలు, ఫోటోలు, వీడియోలతో మీడియా, సోషల్ మీడియా సందడిగా ఉంది.. ఇటీవల వరుస ప్రమాదాలు, మరణాలు సంభవించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు పరిశ్రమ వర్గాల వారు..

సడెన్‌గా నిన్న (డిసెంబర్ 14) ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి మాతృమూర్తి బాల సరస్వతి కన్నుమూశారు. దీంతో కీరవాణి, రాజమౌళి కుటుంబాలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా ఓ పాపులర్ యాక్టర్, డ్యాన్సర్ ఆత్మహత్య చేసుకున్నాడే వార్తతో మరోసారి ఉలిక్కి పడింది చిత్ర పరిశ్రమ..

అమెరికన్ హిప్-హాప్ డ్యాన్సర్, యాక్టర్, కొరియోగ్రాఫర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ .. ‘ది ఎలెన్ డిజెనెరెస్ షో’ (The Ellen DeGeneres Show) లో గతకొద్ది కాలంగా డీజేగా పాపులర్ అయిన డీజే స్టీఫెన్ ‘‘ట్విచ్’’ బాస్ (DJ STEPHEN ‘TWITCH’ BOSS) ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆయన వయసు 40 సంవత్సరాలు. తనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు..

ఇంట్లో నుండి తన కార్ తీసుకుని వెళ్లేప్పుడే అతని ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించిందంటూ భార్య అలిసన్ హోల్కర్ (Allison Holker) పోలీసులకు ఫిర్యాదు చేశారని.. లేదు.. లాస్ ఏంజిల్స్‌లోని ఓ హోటల్‌లో డీజే స్టీఫెన్ గన్‌తో షూట్ చేసుకున్నాడని మీడియాలో వార్తలో వైరల్ అయ్యాయి. కాగా ‘‘ట్విచ్’’ 2008లో ‘సో యు థింక్ యు కెన్ డ్యాన్స్‌’ అనే డ్యాన్స్ షోలో రన్నరప్‌గా నిలిచాడు. తర్వాత హిప్-హాప్ డ్యాన్సర్ జాషువా అలెన్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు.

ఆ తర్వాత హిప్ హాప్ డ్యాన్సులతో పలు షోల్లో పాల్గొని డీజే స్టీఫెన్ “ట్విచ్” బాస్ బాగా పాపులర్ అవడంతో పాటు ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.. మానసిక ఒత్తిడి వల్లే తను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. స్టీఫెన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.. హీలీవుడ్ టెలివిజన్, సినిమా ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ ఆయన మృతికి సామాజిక మాధ్యమాల ద్వారా నివాళి అర్పిస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus