సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటేనే వారి లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుందని భావిస్తారు.ఖరీదైన బంగ్లాలు ఖరీదైన దుస్తులు ఖరీదైన తిండి తింటూ వారి జీవితం ఒక పూల పాన్పులా ఉంటుందని భావిస్తారు. అయితే ఇది అందరి విషయంలోనూ కాదని కొందరు సినిమాలలో నటిస్తున్న ఇప్పటికి కటిక పేదరికం అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా బలగం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మురళీధర్ గౌడ్.
నల్లి బొక్క కోసం పంతానికి పోయి అత్తారింటితో గొడవ పెట్టుకున్న అల్లుడు పాత్రలో (Actor) ఈయన నటించారు. ఇక ఈయన పాత్రకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభించాయి. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పలువురు ఈయనను పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మురళీధర్ గౌడ్ తన కన్నీటి కష్టాల గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఎలక్ట్రీషియన్ బోర్డులో 27 సంవత్సరాలు పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానని తెలిపారు.
అయితే తాము నలుగురు అన్నదమ్ముల ఒక చెల్లి అని ఈయన తెలిపారు. చిన్నప్పుడు తాము ఎంతో కటిక పేదరికం అనుభవించామని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. నాన్న ఎక్కడో దూరంగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఇంట్లో ఏదైనా అవసరమైతే కనీసం పది రూపాయలు కూడా చేతిలో ఉండేది కాదని తెలిపారు. ఐదుగురు పిల్లల పోషణ భారం కావడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని చిరిగిన బట్టలు వేసుకొని తాను తిరిగే వాడిననీ తెలిపారు.
ఇలా చిరిగిపోయిన బట్టలు వేసుకోవడంతో అందరూ తనని చూసి ఎగతాళి చేసేవారని ఇప్పటికీ ఆ సంఘటనలు నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయని మురళీధర్ గౌడ్ తెలిపారు. ఇక తనకు ఉద్యోగం వచ్చిన పెద్దగా కష్టాలు ఏమి తీరలేదని తెలిపారు. 27 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయిన తన బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం జీరోనే అంటూ ఈ సందర్భంగా ఈయన తన కన్నీటి కష్టాలను గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?