హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు, ఇక అంతా డాక్టర్ల చేతిలోనే!

 

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన గోవిందా (Govinda) గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మహారాష్ట్రకు చెందిన శివసేనలో కీలక బాధ్యత నిర్వర్తిస్తున్న గోవిందా ఇవాళ ఉదయం పార్టీ పనుల కోసం కలకత్తా వెళ్లడం కోసం రెడీ అవుతుండగా.. ఆయన చేజారిన సొంత రివాల్వర్ కిందపడి పేలడంతో.. బుల్లెట్ ఆయన కాలి భాగంలోకి చొచ్చుకుపోయింది. సౌండ్ విని వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు మరియు గోవిందను హాస్పిటల్ కి తరలించగా..

Govinda

డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించి బుల్లెట్ ను బయటకు తీశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పుకొచ్చారు. ఆపరేషన్ అనంతరం ఆయన్ను ఇంటికి పంపేశారట. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు గోవింద. అయితే 60 ఏళ్ల గోవింద కాలికి ఇలా బుల్లెట్ గాయం అవ్వడం అనేది ఆయన కాలికి దీర్ఘకాలిక సమస్య తెచ్చిపెట్టే సమస్య ఉందని తెలుస్తోంది.

అయితే.. బుల్లెట్ నిజంగానే గన్ జారి పడడం వల్ల పేలిందా లేక మరింకేదైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగా.. గతంలో ఇదే తరహాలో టాలీవుడ్ లోనూ ఓ సంఘటన జరగడం తెలిసిందే. గోవింద బుల్లెట్ న్యూస్ బయటికి రాగానే చాలామంది ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

బాలీవుడ్ లో అది మాత్రమే ఆశిస్తారు.. పాటల రచయిత కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus