బాలీవుడ్ లో అది మాత్రమే ఆశిస్తారు.. పాటల రచయిత కామెంట్స్ వైరల్!

ప్రభాస్ (Prabhas) సినీ కెరీర్ లోని భారీ సినిమాలలో ఆదిపురుష్ ఒకటి కాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోలేదు. ఈ సినిమా విషయంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఈ సినిమాలోని డైలాగ్స్ విషయంలో సైతం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మనోజ్ ముంతాషీర్ ఆదిపురుష్ (Adipurush) సినిమా ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ఆ ట్రోల్స్ నుంచి బయటపడటానికి చాలా సమయమే పట్టిందని ఆయన తెలిపారు.

Adipurush

లైఫ్ లో ఏదీ శాశ్వతం కాదని తాను తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చని మనోజ్ ముంతాషిర్ కామెంట్లు చేశారు. ఈరోజు మంచి అనిపించింది రేపు చెడుగా అనిపించవచ్చని ఆయన అన్నారు. ఈరోజు చెడుగా అనిపించేది రేపు మంచిగా అనిపిస్తోందని మనోజ్ ముంతాషిర్ కామెంట్లు చేశారు. ఆదిపురుష్ మూవీ టైమ్ లో వచ్చిన ట్రోల్స్ చూసి ఏడ్చానని ఆయన తెలిపారు. అయితే ఆ ట్రోల్స్ వల్ల కుంగిపోలేదని మనోజ్ ముంతాషిర్ చెప్పుకొచ్చారు.

నేను తిరిగి నిలద్రొక్కుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం పగలూ రాత్రి తేడాల్లేకుండా కష్టపడుతున్నానని ఆయన కామెంట్లు చేశారు. బాలీవుడ్ విషయానికి వస్తే ఇదొక మార్కెట్ అని మనోజ్ ముంతాషిర్ వెల్లడించారు. ఈ ఇండస్ట్రీలో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవని మనోజ్ పేర్కొన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం లాభం మాత్రమే ఆశిస్తారని ఆయన కామెంట్లు చేశారు.

నాతో వారికి లాభం ఉందనిపిస్తే నా దగ్గరకు వస్తారని మనోజ్ పేర్కొన్నారు. అలా ప్రస్తుతం మళ్లీ నన్ను సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు. మనోజ్ ముంతాషిర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మనోజ్ ముంతాషిర్ కు ఆఫర్లు పెరుగుతుండటం గమనార్హం. ఆదిపురుష్ సినిమాలోని హనుమంతుని డైలాగ్స్ విషయంలో మనోజ్ ముంతాషిర్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.

ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus