కొద్దిరోజులుగా సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు వరుసగా మరణిస్తూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఈ మధ్యనే టాలీవుడ్ సీనియర్ కమెడియన్ కడలి జయసారథి మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుండి ఇండస్ట్రీ ఇంకా కోలుకోక ముందే నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు కంటమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించారు.అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు మరణిస్తూ ఉండడం విషాదంలోకి నెట్టే అంశం.
ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు మిథిలేష్ చతుర్వేది కూడా మరణించడం అందరికీ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నిన్న అంటే ఆగస్టు 3న(బుధవారం నాడు) సాయంత్రం ఆయన మరణించినట్లు తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చతుర్వేది గారు.. లక్నోలోని తన స్వగ్రామంలో మరణించడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఆయన.. గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి కోలుకునేందుకు చతుర్వేది.. తన స్వగ్రామానికి వెళ్లారు.
కానీ.. ఆయన వెళ్లిన కొద్ది సమయానికే మృతి చెందడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇక మిథిలేష్ మరణవార్తను అతని అల్లుడు ఆశిష్ చతుర్వేది తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మిథిలేష్ చతుర్వేది వయస్సు 68 సంవత్సరాలు కాగా, బాలీవుడ్లో ఆయన ‘కోయి మిల్ గయా’, ‘గదర్ ఏక్ ప్రేమ్ కథ’, ‘సత్య’, ‘బంటీ ఔర్ బబ్లీ’, ‘క్రిష్’, ‘తాల్’, ‘రెడీ’, ‘అశోక మరియు ఫిజా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
అంతేకాకుండా ‘స్కామ్ 1992’ ద్వారా ఆయన మరింత పాపులర్ అయ్యారు. ఆ వెబ్ సిరీస్ లో చతుర్వేది.. రామ్ జెఠ్మలానీ పాత్రని పోషించారు. చివరిగా ‘బంచాడా’ అనే చిత్రంలో నటించారు చతుర్వేది.