ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో, సీనియర్ నటి విజయ భాను,నటి, మోడల్ అయిన షెఫాలీ జరీవాలా, దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి,హుమైరా అస్గర్ అలీ, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, కోటా శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ మొదలగువారు మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అయితే ఎం.కె.ముత్తు మరణించారు. ఆయన వయసు 77 ఏళ్ళు. కొన్నాళ్లుగా వయోభారంతో బాధపడుతూ వస్తున్న ఆయన .. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి హాస్పిటల్లో జాయిన్ చేశారట. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది.
ముత్తు అసలు పేరు ముత్తువేల్ కరుణానిధి ముత్తు. నటనపై ఉన్న ఆసక్తితో ఈయన సినిమాల్లో అడుగుపెట్టారు.సింగర్ గా కూడా పలు పాటలు పాడటం జరిగింది. ‘పిల్లయో పిళ్లై’ ‘సమయ్కరణ్’ ‘పూక్కరి’ ‘అనయవిలక్కు’ ‘ఇంగేయుమ్ మనన్’ మొదలగు సినిమాల్లో ఈయన నటించారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా రాణించారు. ఈయన మరణంపై కోలీవుడ్ నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.