ప్రభాస్‌తో నాలుగోసారి నటిస్తున్న ఆ సీనియర్ యాక్టర్ ఎవరంటే..

టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న డార్లింగ్.. తను నటిస్తున్న ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.. ఇప్పటికే బాలీవుడ్ డెబ్యూ ‘ఆదిపురుష్’ విడుదలకి సిద్ధమవుతోంది.. తర్వాత ‘సలార్’ షెడ్యూల్ అయిపోయింది.. 2024 సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ – K’ కూడా వచ్చేస్తోందంటున్నారు.. మధ్యలో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ ఒకటుంది..

ఇంతలో దిల్ రాజు – ప్రశాంత్ నీల్ కాంబోలో మరో సినిమా అనౌన్స్ చేశారు.. ఇటీవల మారుతి దర్శకత్వంలో సైలెంట్‌గా ఓ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు.. హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందీ చిత్రం.. సూపర్ నేచురల్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారని సమాచారం.. ఈ మూవీ కోసం భారీ వ్య‌యంతో ఓ పాత‌కాలం నాటి థియేట‌ర్ సెట్‌ వేశారు.. ఇక ప్రభాస్‌కి అక్కగా అప్పటి కథానాయిక భూమిక కనిపించనుందని వార్తలు వస్తున్నాయి..

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం మరో సీనియర్ యాక్టెర్ ‘డీలక్స్ రాజా’ టీంలో జాయిన్ అవుతున్నారని తెలుస్తోంది.. ఆయనెవరో కాదు.. ‘కట్టప్ప’ గా ‘బాహుబలి’ కి అన్నివేళలా అండగా నిలబడ్డ సత్యరాజ్.. ఈ సినిమాలో ప్రభాస్ తాత క్యారెక్టర్‌లో కనిపించనున్నారనే క్రేజీ అప్‌డేట్ వచ్చింది.. ఫస్ట్ ‘మిర్చి’ లో ప్రభాస్ తండ్రిగా నటించని సత్యరాజ్.. ‘బాహుబలి’ సిరీస్ సినిమాల్లో కట్టప్పగా మెప్పించారు.. బాహుబలిని కట్టప్ప చంపే సీన్ ఎప్పటికీ మర్చిపోలేం..

మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారనే వార్త తెలియగానే సినిమా సూపర్ హిట్ అవుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేసి.. ఈ ఏడాది చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టి.జి. విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus