సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

  • November 26, 2022 / 04:14 PM IST

గతకొద్ది రోజులుగా వరుస మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు కారణాల వల్ల మృతిచెందారు. సెలబ్రెటీలు వరుసగా కన్ను మూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగి పోతున్నారు.. సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు మదన్, బెంగాళీ నటి ఇంద్రీలా శర్మ, పంజాబ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ దల్జీత్ కౌర్ ఖంగురా వంటి వారు కన్నుమూశారు.

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్రమ్ గోఖలే, విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర వంటి వారు ఆసుపత్రిలో చేరారనే వార్తలతో అంతా షాక్ అయ్యారు. శనివారం (నవంబర్ 26) విక్రమ్ గోఖలే మరణించినట్లు ప్రకటించారు. విక్రమ్ గోఖలే ఇటీవల తీవ్ర అనారోగ్యంతో పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. గురువారం నాడు (నవంబర్ 24) ఆయన చనిపోయారంటూ వార్తలు రావడంతో.. వాటిని ఖండిస్తూ.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని..

వైద్యులు వెంటిలేర్‌పై చికిత్స అందిస్తున్నారని గోఖలే కుటుంబ సభ్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. విక్రమ్ గోఖలే వయసు 77 సంవత్సరాలు.. మరాఠీ, హిందీ భాషల్లో పలు విభిన్న పాత్రలు పోషించి, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు భార్య వృషాలి గోఖలే. ఇద్దరు పిల్లలున్నారు. 1945 నవంబర్ 14న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. తండ్రి ప్రముుఖ మరాఠీ థియేటర్, సినీ నటుడు చంద్రకాంత్ గోఖలే బాటలోనే విక్రమ్ కూడా నాటకాల నుండి సినిమాల వైపు వచ్చారు.

మరాఠీ తర్వాత 1971లో అమితాబ్ బచ్చన్ ‘పర్వానా’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘అగ్నిపథ్’, ‘హమ్ దిల్ దే చుకేసనమ్’, ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘మిషన్ మంగళ్’.. ఇలా 40 ఏళ్ల కెరీర్‌లో పలు హిందీ చిత్రాలు చేశారు. టీవీ షోలు, సీరియల్స్‌లోనూ కనిపించారు. 2010లో ‘ఆఘత్’ అనే మరాఠీ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యారు.

2013లో ‘అనుమతి’ అనే మరాఠీ సినిమాకి గానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. చివరిగా ఈ ఏడాది జూన్‌లో వచ్చిన ‘నికమ్మ’ లో కనిపించారు. నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ కిది రీమేక్. శిల్పా శెట్టి.. భూమిక రోల్ చేసింది.. హిందీ, మరాఠీ పరిశ్రమలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు విక్రమ్ గోఖలే మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus