భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లతో కంగారు పెట్టిన స్టార్ నటి..!

హీరోయిన్లు ప్రేమలో పడటం.. బ్రేకప్ లు చెప్పుకోవడం సర్వసాధారణమైన విషయం.అయితే కొంతమంది హీరోయిన్లు సిన్సియర్ గా ప్రేమించడం వలనో ఏమో కానీ.. ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేరు. ఎంతో ఎమోషనల్ అయిపోయి తమ సినీ కెరీర్ ను సైతం నిర్లక్ష్యం చేస్తుంటారు.గతంలో శృతీ హాసన్, ఇలియానా వంటి భామలు కూడా లవ్ లో ఫెయిల్ అవ్వడంతో డిప్రెషన్ కు వెళ్లిపోయారు.ఈ లిస్ట్ లో దంగ‌ల్‌ న‌టి స‌న్యా మ‌ల్హోత్రా కూడా ఉందనేది తాజా సమాచారం.

ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సన్యా పలు ఎమోషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళ్తే… ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించిందట. నాలుగేళ్ల పాటు అతనితో రిలేష‌న్లో ఉన్న సన్యా అతనికి బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని తెలిపింది. ఊహించని విధంగా అలా జరగడంతో డిప్రెషన్ కు వెళ్ళిపోయినట్టు ఆమె చెప్పుకొచ్చింది.ఇప్పటికీ తన బ్రేకప్ మేటర్ ఆమెను ఎంతో బాధిస్తోంద‌ని చెప్పుకొచ్చింది. దానికంటే బాధ‌ప‌డే విష‌యం మ‌రొక‌టి ఉండ‌ద‌ని…

మ‌న‌ల్ని కాద‌నుకున్న వారి గురించి మ‌నం ఆలోచించ‌కుండా ఉండలేమని.. కానీ ఆలోచించకుండా ఉంటేనే మంచిదని తెలిపింది ఈ నటి. అయితే లేటైనా కోలుకున్న సన్యా.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఆరోగ్యం, సినిమాల‌ పైనే పెట్టినట్టు వివరించింది . ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక స‌న్యా న‌టించిన‌ ‘మీనాక్షి సుందరేశ్వర్’ ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలై…ప్రేక్ష‌కుల నుండీ మంచి స్పందన రాబట్టుకుంటుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus