సినిమాలో ప్రతి పాత్రా కీలకం కాకపోవచ్చు.. కానీ కీలకమై ప్రతి పాత్రా సినిమా విడుదలకు ముందు అనుకున్నంత ప్రచారంలోకి రాకపోవచ్చు, ఆ సినిమా టీమ్ తీసుకురాకపోవచ్చు కూడా. గతంలో చాలా పాత్రలు సినిమా తొలి షో పడిన తర్వాతనే బయటికొచ్చాయి. దానినే సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అని అంటుంటాం. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో అలాంటి ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌ఉంది అని.. అది అంజలినే అని అంటున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి గత కొన్ని నెలలుగా మాట్లాడుకుంటున్నాం.
టీమ్ కూడా సినిమా గురించి చెబుతూ వస్తోంది. అయితే రామ్ చరణ్ (Ram Charan) స్క్రీన్ ప్రజెన్స్ గురించి, దర్శకుడు శంకర్ (Shankar) టేకింగ్ గురించి, సినిమాల పాటలకు పెట్టిన రూ.75 కోట్ల ఖర్చు గురించి, తమన్ (S.S.Thaman) సంగీతం గురించి, కియారా అడ్వాణీ (Kiara Advani) అందం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఎవరూ ఆమె గురించి పెద్దగా చెప్పడం లేదు. ఆమెనే అంజలి (Anjali) . సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో అంజలి పాత్ర వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లుక్ చూసినా అదే అర్థమవుతోంది.
ఈ క్రమంలో సినిమా కీలకమైన మలుపు తిప్పే సన్నివేశాల్లో అంజలి పాత్ర అందరికీ షాక్‌కి గురి చేస్తుంది అని అంటున్నారు. సినిమా ఒక మూడ్‌లో సాగిపోతుంటే ఆమె వచ్చి మొత్తం పరస్థితినే మార్చేస్తుంది అని కూడా చెబుతున్నారు. సినిమా ఇప్పటివరకు వచ్చిన సోలో పాట, మూడు డ్యూయెట్లు అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. ఇవి కాకుండా మరో మాస్ సాంగ్ ఒకటి ఉందని, అది ఇంకా అదిరిపోతుంది అని టీమ్ చెబుతోంది.
అయిత ఆ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇంకా తెలియడం లేదు. సినిమా విడుదలకు ఇంకా గట్టిగా రెండ వారాలు కూడా లేని నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం జోరు పెంచాలి అని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి టీమ్ ఎలాంటి ప్లాన్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమా టీమ్ ప్రచారం ఫుల్ జోష్‌లో సాగుతోంది. ‘డాకు మహరాజ్’(Daaku Maharaaj) ప్రచారం కూడా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది.