సినిమా పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నెలలో చూసుకుంటే.. మలయాళ సీనియర్ నటి మీనా, భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) సోదరుడు నందు, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్,మలయాళ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంటీ(MT) వాసుదేవన్ నాయర్,కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి వంటి వారు మృతి చెందారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో సీనియర్ నటుడు అనుమానాస్పద స్థితిలో చచ్చిపడున్నాడు అనే వార్త వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ (Dileep Shankar) ఓ హోటల్ రూమ్లో శవమై కనిపించడం అందరికీ షాకిచ్చింది. ఓ రకంగా ఈ వార్త మలయాళ సినీ పరిశ్రమని కుదిపేసింది అనే చెప్పాలి. దిలీప్ శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అతన్ని ఎవరైనా హత్య చేశారా? లేక హార్ట్ ఎటాక్ వంటిది సంభవించి మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. అతని వయసు 54 ఏళ్లు.! అందుతున్న సమాచారం ప్రకారం.. దిలీప్ శంకర్ ‘పంచగని’ అనే సీరియల్ షూటింగ్ కోసం ఆ హోటల్‌లోకి దిగాడట.
కొన్ని రోజులుగా అతను హోటల్ రూమ్ నుండి బయటకు రాకపోవడంతో.. అతని మరణ వార్త బయటకు వచ్చిందని తెలుస్తుంది. మరోపక్క కొన్నాళ్లుగా దిలీప్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ‘పంచాగ్ని’ టీవీ సీరియల్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. పోలీసులు దిలీప్ మరణంపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.