Jabardasth: ఇక నుంచి ఖుష్బూ స్థానంలో స్టార్ హీరోయిన్..!

కొన్నిసినిమాలు ఎన్ని ఏళ్ళు గడిచినా గుర్తుండిపోతాయి.. అలా గుర్తుండిపోయే సినిమానే గులాబీ. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈనాటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి, మహేశ్వరి హీరో హీరోయిన్స్ గా నటించారు. అందమైన ప్రేమ కథతో పాటు థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ తో ఉండే ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ మళ్లీ ఇనాళ్లకు ట్రేండింగ్ లోకి వచ్చింది.

బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న కామెడీ షో జబర్దస్త్. కొన్నేళ్లుగా ఈ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పుడు జడ్జిలు అంటే రోజా, నాగబాబు మాత్రమే ఉండేవారు. దీంతో ఈ షో టీఆర్పీ రేటింగ్ టాప్ లో ఉండేది. కానీ నాగబాబు, రోజా పలు కారణాలవల్ల వారిద్దరూ జబర్దస్త్ వదిలి వెళ్లిపోయారు. ఇక గ్లామర్ బ్యూటీ అనసూయ కూడా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పడంతో పాటు టాప్ కంటెస్టెంట్లు సుధీర్, ముక్కు అవినాష్ తదితర కమెడియన్స్ షో నుంచి వెళ్లిపోయారు.

యాంకర్ అనసూయ ప్లేస్ లో యాంకర్ గా సౌమ్యరావు గత కొద్దిరోజులుగా హోస్టింగ్ చేశారు. తర్వాత ఆమె ప్లేస్ లోకి బిగ్ బాస్ ఫేం సిరి హనుమంతు వచ్చారు. ఇటీవల కాలంలో జబర్దస్త్ షో కి జడ్జిలుగా కృష్ణ భగవాన్, ఖుష్బూ వ్యవహరిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఖుష్బూ ప్లేసులో ఇప్పుడు తాజాగా అలనాటి నటి శ్రీదేవి చెల్లెలు.. హీరోయిన్ మహేశ్వరి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గులాబీ, పెళ్లి వంటి చిత్రాలలో నటించిన ఆమె ఇప్పుడు జబర్దస్త్ షోలో సందడి చేసింది. చాలా కాలం తర్వాత ఆమెను చూడడంతో అభిమానులు ఆనందపడుతున్నారు. కాకపోతే ఖుష్బూ మార్కు కామెడీ మిస్సయిందని ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. మరి ఈ ఒక్క ఎపిసోడ్ కు మాత్రమే ఈమె ఉంటుందా లేకపోతే (Jabardasth) జబర్దస్త్ షో కి తాను ఇలాగే కొనసాగుతుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus