తమిళ నటి మీరా మిథున్ దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దళితుల కారణంగానే కోలీవుడ్ లో మంచి సినిమాలు రావడం లేదని.. వారంతా కోలీవుడ్ నుండి బయటకు వెళ్లిపోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రీసెంట్ గా మీరా మిథున్ సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఒక డైరెక్టర్ ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ డైరెక్టర్ తన ఫోటోను అనుమతి లేకుండా దొంగిలించి పబ్లిసిటీ కోసం వాడుకున్నాడని ఆవిడ ఆరోపించింది.
ఈ క్రమంలో దళితులు అందరినీ ఒకే గాటన కట్టి కించపరిచే వ్యాఖ్యలు చేసింది. దళితులు క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారని.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారి వలనే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తున్నాయని.. తమిళ సినీ ఇండస్ట్రీలో ఎవరైనా షెడ్యూల్ కులాల వారు ఉంటే వాళ్లు బయటకు వెళ్లిపోవాలని..వారి వలనే క్వాలిటీ సినిమాలు రావడం లేదని కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపుతున్నాయి.
తమిళనాడుకు చెందిన దళిత పక్షపాత పార్టీ వి ఎస్ కె… మీరా మిథున్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళితులను కించపరిచేలా ఈవిడ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరింది. వీడియో ఆధారాలు కూడా ఉండడంతో పలు సెక్షన్ల కింద ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ కేసుపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి!