ప్రియుడికి గుడ్ బై చెప్పేసిన సీనియర్ నటి!

మాజీ విశ్వసుందరి సుష్మితాసేన్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 46 ఏళ్ల ఈ బ్యూటీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుంది. ఈ విషయంలో చాలా మంది సుష్మితాను అభినందించారు. ప్రస్తుతం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తోంది సుష్మితా. పెళ్లి చేసుకోకపోయినా.. స్నేహాలు, సహజీవనాల పేరుతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది సుష్మితా. గతంలో బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ తో కొన్నాళ్లపాటు రిలేషన్ లో ఉంది సుష్మితా.

ఆ తరువాత బ్రేకప్ జరిగింది. తరువాత వేరే వాళ్లతో రిలేషన్ లో ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే కొన్నేళ్లుగా మాత్రం ఈమె రోహ్మన్ షాల్ తో సహజీవనం చేస్తోంది. ఈ బంధాన్ని రోహ్మన్ పబ్లిక్ గా వెల్లడించాడు. సుష్మితాతో రిలేషన్ లో ఉన్నానని.. తామంతా ఒక ఫ్యామిలీలా ఉంటున్నట్లు చెప్పాడు. సుష్మిత కూతళ్లకు తను తండ్రి లాంటివాడినని అన్నాడు. తామంతా ఒక కుటుంబంగా మెలుగుతూ ఎంతో ఆనందంగా ఉంటున్నట్లు చెప్పాడు.

ఎప్పటికప్పుడు సుష్మితతో కలిసి తీసుకున్న ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటాడు రోహ్మన్. కొన్నాళ్లక్రితం ఇద్దరూ కలిసి జిమ్ చేస్తున్న వీడియోలను షేర్ చేయగా.. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సుష్మిత తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ వేరుపడ్డారని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇటీవలే సుష్మితకు చిన్న సర్జరీ జరిగింది. దీంతో ఆమె ఆరువారాల పాటు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంది. మరిప్పుడు రోహ్మన్ తో బ్రేకప్ విషయంపై స్పందిస్తుందేమో చూడాలి!

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus