ప్రముఖ నటి దెబినా బోనర్జీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తక్కువగానే సినిమాలు చేసిన దెబినాకు ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో బుల్లితెరపై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ బుల్లితెరపై మాత్రం మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. హిందీ రామాయణం ద్వారా ఈ బ్యూటీ పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ లో రాముడి రోల్ లో నటించిన గుర్మీత్ ను ఈ నటి వివాహం చేసుకున్నారు.
2006 సంవత్సరంలో రహస్యంగా 2011 సంవత్సరంలో గ్రాండ్ గా గుర్మీత్ తో ఈ బ్యూటీ వివాహం జరిగింది. ప్రస్తుతం దెబినా అమ్మతనాన్ని ఆస్వాదిస్తుండగా తన లుక్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ఆమె స్పందించారు. నాకు కూడా ఫిట్ గా ఉండాలని ఉంటుందని అందుకోసం వ్యాయామాన్ని మొదలుపెట్టానని ఆమె తెలిపారు. వ్యాయామం చేయడం వల్ల శరీరం కూడా సహకరిస్తుందని అలా అని తల్లులందరూ వ్యాయామం చేయాలని నేను చెప్పనని ఆమె కామెంట్లు చేశారు.
బరువు తగ్గే విషయంలో ఒక్కొక్కరి శరీరం ఒక్కో విధంగా స్పందిస్తుందని దెబినా అన్నారు. నేను ఇప్పటికీ బరువు తగ్గకపోవడంతో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని దెబినా చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్ల వల్ల నాపై ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉందని ఆమె పేర్కొన్నారు. నేను పాలిచ్చే తల్లినని డైట్ విషయంలో రూల్స్ పెట్టుకోలేనని దెబినా అన్నారు.
నేను తిండికి సంకెళ్లు వేస్తే పిల్లలకు సరిపడా పాలు రావని (Actress) ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం పిల్లల గురించి ఆలోచించాలని నేను అనుకుంటున్నానని దెబినా అన్నారు. ప్రస్తుతం పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తానని ఆ తర్వాత మాత్రమే బరువు తగ్గుతానని దెబినా చెప్పుకొచ్చారు. నా పిల్లలకు పాలివ్వడం మానేసి నేను సన్నబడలేనని దెబినా అన్నారు.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్