స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇష్యూ దేశం మొత్తాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ట్యాలెంటెడ్ హీరో నెపోటిజం కారణంగానే డిప్రెషన్ కు లోనయ్యి ఈ దారుణానికి పాల్పడినట్టు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ‘బాలీవుడ్ లో ఎప్పటి నుండో పేరుకుపోయి ఉన్న నెపోటిజం కారణంగానే కొన్ని ప్రాజెక్టు ల నుండీ సుశాంత్ ను తప్పించడంతో అతను డిప్రెషన్ కు లోనవ్వడానికి కారణం అయ్యింది’.. అంటూ అక్కడి ప్రేక్షకులు… బాలీవుడ్ స్టార్లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలో ఎప్పుడూ అక్కడి స్టార్లను దుమ్మెత్తుపోసే హీరోయిన్ కంగనా రనౌత్ కూడా పెద్ద ఎత్తున ‘నెపోటిజం’ ఉందంటూ పెద్ద ఎత్తున రచ్చ చేసి తాప్సి వంటి హీరొయిన్లను కూడా విమర్శించింది. అయితే ఇప్పుడు కంగనాకు ఓ స్టార్ హీరోయిన్ ఇండైరెక్ట్ గా పెద్ద కౌంటర్ ఇచ్చింది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు కరీనా కపూర్. ఆమె మాట్లాడుతూ.. ”నెపోటిజంను అడ్డుపెట్టుకుని మాత్రమే నేను 21 సంవత్సరాలుగా స్టార్ గా కొనసాగడం లేదు. అది సాధ్యం కాని పని.! అలా అయితే ఎంతో మంది సూపర్‌ స్టార్ల వారసులు సక్సెస్ కాలేకపోయిన సందర్భాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి.

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేసుకుంటూ ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే ఉండాలి. కేవలం నా కుటుంబం కారణంగానే నాకు అవకాశాలు వచ్చాయని భావించడం లేదు. నా ఎదుగుదలకు నా కష్టం కూడా తోడైంది. ఎవర్ని స్టార్‌ని చెయ్యాలనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ‘మమ్మల్ని స్టార్‌లుగా తయారు చేసేది ప్రేక్షకులే. షారుక్‌ ఖాన్‌, అక్షయ్ కుమార్‌, రాజ్‌కుమార్‌ రావు, ఆయుష్మాన్‌ ఖురానా వంటి హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా ఎదిగిన వాళ్ళే” అంటూ కరీనా చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus