హిందీ టెలివిజన్ నటి దీపికా కకర్ (Dipika Kakar) అనారోగ్యం పాలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె భర్త అలాగే నటుడు అయిన షోయబ్ ఇబ్రహీం ఈ విషయాన్ని వెల్లడించారు. అతడు మాట్లాడుతూ.. “కొన్నాళ్లుగా దీపిక కడుపు నొప్పితో బాధపడుతుంది.అసిడిటీ వల్లే తనకి ఆ బాధ వస్తుందేమో అని మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇంతకీ నొప్పి తగ్గకపోవడంతో వైద్యులను సంప్రదించాం. అప్పుడు వారు యాంటీబయాటిక్స్ రాసిచ్చారు. అలాగే బ్లడ్ టెస్ట్ వంటివి చేయించుకోమని సూచించారు.
అవి వాడటం మొదలుపెట్టాము. అయితే మా తండ్రి పుట్టినరోజు వేడుకల టైంలో దీపికకు మళ్లీ కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆలస్యం చేయకుండా బ్లడ్ టెస్ట్ చేయించాం. అప్పుడు ఆమె కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది.తర్వాత వైద్యులను సంప్రదించగా.. వారు సీటీ స్కాన్ సీటీ స్కాన్ చేసి దీపిక (Dipika Kakar) కడుపులో ఒక కణితి ఉన్నట్లు నిర్ధారించారు. టెన్నిస్ బంతి సైజులో ఆ కణితి ఉంది అని వారు తేల్చారు. దీంతో మాకు ఏం చేయాలో తెలీలేదు.
అయితే ఆరంభ దశలోనే ఆ విషయం తెలియడం అనేది మాకు కొంత ఊరట నిచ్చే విషయం. ఇప్పుడు మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందట. అనంతరం వైద్యులు చికిత్స ప్రారంభిస్తారని చెప్పారు” అంటూ షోయబ్ ఇబ్రహీం చెప్పుకొచ్చారు.ఇక దీపిక హిందీలో పలు సీరియల్స్ లో నటించి పాపులర్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో కూడా పాల్గొంది. అలాగే పల్టాన్ వంటి సినిమాల్లో కూడా నటించింది.