Bhagavanth Kesari: పాపం ఆ హీరోయిన్ పరిస్థితేంటి ఇలా అయింది..!

ఒకప్పుడు హీరోల పాలిట లక్కీ హీరోయిన్ అనిపించుకుంది కాజల్ అగర్వాల్. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్ కాస్త స్లో కాగానే పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఈ మధ్యలనే మళ్లీ సినిమాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గానే ప్రకటించింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో టాలీవుడ్ క్రష్ శ్రీ లీల నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఆ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ను లేపేశారని వార్తలు వినిపిస్తున్నాయి. భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల పాత్రకే అతి ముఖ్యమైన పాత్ర ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు పోస్టర్స్ టీజర్ సాంగ్స్ లలో శ్రీలీలనే ఎక్కువగా కనిపించింది. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావుపూడి ఎక్కడ కూడా కాజల్ ను చూపించలేదు.

సినిమాలో (Bhagavanth Kesari) కేవలం శ్రీ లీల హంగామానే కనిపిస్తోంది. దీంతో సినిమాలో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ తీసేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కాజల్, శ్రీ లీలకు తల్లి పాత్రలో నటిస్తోందట. అంత పెద్ద వయసున్న పాత్రలో కాజల్ ఎలా నటిస్తోంది.. మే ఒప్పుకోమంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేసింది. డైరెక్టర్ అనిల్ రావు పూడి తో పాటు శ్రీ లీల.. కాజల్ అగర్వాల్ వేసిన డ్యాన్స్ స్టెప్పుల వీడియో తెగ వైరల్ అయింది.

బహుశా షూటింగ్ గ్యాప్లో తను హీరోయిన్లతో దర్శకుడు అనిల్ రావిపూడి ఇలా హుషారుగా డ్యాన్స్ చేయించారన్న వార్తలు వినిపించాయి. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా అయినప్పటికీ ఇప్పుడు తాజాగా కాజల్ క్యారెక్టర్ లేపేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం విక్రమ్, ఖైదీ వంటి సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సినిమా చేశారని సమాచారం. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా మొదట కాజల్ అగర్వాల్ ను అనుకుని తర్వాత ఆ సన్నివేశాలను కూడా ఇలాగే డిలీట్ చేశారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus