బాలీవుడ్ లో తరచూ ఏదొక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. మొన్నటివరకు బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమా వస్తుందంటే చాలు.. బాయ్ కాట్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నట్లు నెటిజన్లు. ఈ క్రమంలో చాలా సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దానికి ఈ నెగెటివ్ ట్రెండ్ తో పాటు కంటెంట్ కూడా కారణమని చెప్పాలి. ఇక నెపోటిజంపై అయితే ట్రోల్స్ వస్తూనే ఉంటాయి.
ఈ విషయాలను పక్కనపెడితే.. కొన్నాళ్లక్రితం జరిగిన ఓ సంఘటన మళ్లీ చర్చకు దారి తీసింది. రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం, పౌరసత్వ సవరణ చట్టం.. ఎన్ఆర్సీకి ఆమోదం తెలుపుతూ ఉతర్వులు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా 2020 జనవరి మొదటివారంలో ఢిల్లీలోని జేఎన్యూ యూనివర్శిటీలో కొందరు విద్యార్థులు నిరసనకు దిగారు. అప్పట్లో ఇది హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు మాస్క్ వేసుకొని దాడి చేయడంతో దాదాపు యాభై మంది గాయపడ్డారు.
వీళ్లను చూడడానికి హీరోయిన్ దీపికా పదుకోన్ అప్పట్లో క్యాంపస్ కి వెళ్లింది. ఈ విషయం అప్పట్లో రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. అయితే హీరోయిన్ దీపికా జేఎన్యూకి వెళ్లడానికి దాదాపు రూ.5 కోట్ల వరకు డబ్బు తీసుకుందని ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయంపై దీపికా ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా నటి స్వరాభాస్కర్ ఈ విషయంపై స్పందించింది. రెండు నిమిషాల పాటు జేఎన్యూలో ఉన్నందుకు రూ.5 కోట్లు ఇచ్చారా..?
సినిమా వాళ్ల గురించి ఇంత చెత్తగా మాట్లాడుకుంటారా..? సినిమా వాళ్లు ఎలా కనిపిస్తున్నారు..? అని మండిపడింది స్వరాభాస్కర్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.