4 సంవత్సరాలు సహజీవనం.. ఇప్పుడు పెళ్ళికి రెడీ అంటూ పోస్ట్..

బాలీవుడ్‌లో పెళ్ళైన జంటలు విడాకులు తీసుకోవడం, తర్వాత డేటింగ్ లు చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం… వంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు. మలైకా అరోరా-అర్జున్‌ కపూర్‌ లు ఇందుకు అతీతం కాదు అని ఎప్పుడో తేల్చి చెప్పేశారు. 2017 వ సంవత్సరం నుండి ఈ జంట డేటింగ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు వీళ్ళు గాఢమైన ప్రేమలో ఉన్నారు. హ్యాపీగా వెకేషన్స్‌ కు, పార్టీలకు, ఫంక్షన్స్‌ కు తిరుగుతున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం.

అయితే మలైకా అరోరా గతంలో సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతను మలైకా వద్దే ఉంటున్నాడు. అయినప్పటికీ అర్జున్ కపూర్ ఈమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ 4 ఏళ్ళలో ఆమెతో సహజీవనం చేస్తూ ఆమె కొడుకుని కూడా తన సొంత కొడుకులా చూసుకుంటున్నాడు.అయితే మలైకా పెళ్లి పై తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి 17 ఏళ్ళు టైం తీసుకుంది.

ఎట్టకేలకు అర్జున్ కపూర్‌తో పెళ్ళికి రెడీ అయినట్టు ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో కొంతమంది సెలబ్రిటీలు, నెటిజన్లు.. కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అయినందుకు ఆల్ ది బెస్ట్ చెబుతుంటే… ఇంకొంతమంది మాత్రం 47 ఏళ్ళ వయసులో నీకు పెళ్లి అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఇలాంటి విమర్శలను ఈ జంట అస్సలు పట్టించుకోదు అన్న సంగతి తెలిసిందే. పట్టించుకునే ఉద్దేశం ఉంటే ఇన్నాళ్లు వీళ్ళు కలిసుండేవాళ్లు కాదు అనే చెప్పొచ్చు. ఏదేమైనా మలైకా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus