లిమిట్స్ క్రాస్ చేసి నా ఫోటోలు తీశారు… స్టార్ హీరోయిన్ ఆవేదన!

సెలబ్రిటీల ఎదురుగా కనబడితేనే మన చేతిలో ఉన్న ఫోన్ ఆగదు. ఏదో ఒక రకంగా వారి వీడియోలు తీసేసి, వారితో ఫోటోలు దిగేసి.. తొందరగా వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసెయ్యాలి బోలెడన్ని లైకులు, షేర్లు, కామెంట్లు రాబట్టుకోవాలి.వాటికంటే ముందు ఆ ఫోటోలను పదే పదే చూసుకుని మురిసిపోవాలి. రూపాయి లాభం లేకపోయినా మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించిన ఫీలింగ్ ఇస్తుంది కదా ఆ పని..! అభిమానుల ఆనందం ఇక్కడి వరకు ఉంటే పర్వాలేదు..

కానీ ఎప్పుడైతే వారి ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వికృత చర్యలు చేపడతారో అప్పుడు వస్తుంది అసలు సమస్య. కొంతమంది అతి ఉత్సాహం కలిగిన వ్యక్తులు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలను సేకరించి క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. లైక్స్, షేర్స్ కోసం రిస్క్ లు చేసి మరీ సినిమా వాళ్ళ ఇంటి గుట్టును బయటపెట్టాలని పరితపిస్తుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. తాజాగా బాలీవుడ్ జంట రణబీర్ – అలియాకి మరోసారి ఇలాంటి పరిస్థితి వచ్చి పడింది.

విషయం ఏంటి అంటే.. రణబీర్ కపూర్- అలియా భట్ లకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఆమె పేరు రహా కపూర్. ఇప్పటివరకు ఆమె ఫేస్ ని రివీల్ చేయలేదు అలియా దంపతులు. చూపిస్తారన్న నమ్మకం కూడా లేకో ఏమో కానీ ఇద్దరు ఫోటోగ్రాఫర్లు అలియా ఇంట్లో సీక్రెట్ కెమెరాను పెట్టేసి ఆమెకు షాకిచ్చారు. అలియా ఈ విషయాన్ని తొందరగానే గమనించింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో “నేను మధ్యాహ్న సమయంలో హ్యాపీగా ఇంట్లో గడుపుతున్నాను.

ఆ టైంలో నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించి మొత్తం పరిశీలించాను. అప్పుడు నాకు పెద్ద షాక్ తగిలింది. మా పక్కింటి టెర్రస్ పై ఇద్దరు వ్యక్తులు చేతిలో కెమెరాలు పట్టుకొని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఇది మా ప్రైవసీకి భంగం కలిగించడమే.. ఇక చాలు.. మీరు లిమిట్ క్రాస్ చేసి నా పర్సనల్ లైఫ్ ను బయటపెట్టాలని చూశారు.. నా ఇంట్లోనే కెమెరాలు పెడతారా..?” అంటూ ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది. దీంతో ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus