పాపులర్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రమాదానికి గురైందనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. ‘నాన్నొబ్బ బరతియా’ షూటింగ్ స్పాట్‌లో ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది చేతికి గాయమైంది. దీంతో యూనిట్ సిబ్బంది ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. కన్నడ, తమిళ్ భాషల్లో, బాబు గణేష్ డైరక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాగిణి కమాండో క్యారెక్టర్ చేస్తోంది. క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ అలాగే గన్ ఫైరింగ్ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుందామె.
ఈ సినిమాలో ఫైట్స్ సీన్స్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశారట డైరెక్టర్.. రీసెంట్‌గా యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తుండగా సెట్లో ప్రమాదవశాత్తూ రాగిణి చేతికి గాయమైంది.. వెంటనే షూటింగ్ నిలిపివేసి ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ అనంతరం కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు డాక్టర్స్. రాగిణి తన ఎడమ చేతికి గాయమైన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. చేతికి కట్టు ఉన్న పిక్ పోస్ట్ చేస్తూ.. ‘మీ శరీరం దేన్నైనా తట్టుకోగలదు..
మీరు ఒప్పించాల్సింది మీ మనసుని.. నవ్వు ఎప్పుడూ చెదిరిపోకుండా ఉంటుంది.. త్వరలో షూటింగ్‌లో జాయిన్ అవుతాను’ అని రాసుకొచ్చింది.. దీంతో రాగిణి త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్, కన్నడ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేయగా.. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ‘జెండాపై కపిరాజు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాగిణి ద్వివేది.
అంతకుముందు 2009లో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పక్కన ‘వీర మడక్కరి’ అనే మూవీతో శాండల్ వుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. హిందీ, తమిళ్, మలయాళంలోనూ ఆమె సినిమాలు చేసింది. గతంలో శాండల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ ఇష్యూలోనూ రాగిణి పేరు వినిపించింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం.. తర్వాత కొద్దిరోజులకు బయటక రావడం జరిగింది. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. తర్వాత సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటుంది రాగిణి ద్వివేది..