Actress: ప్రెగ్నెట్ గా ఉన్నప్పుడు ఆ నటుడు చేసిన పనికి విడాకులు తీసుకున్నాం..

చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం అలా సౌత్ భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి అంజు. అసలు పేరు పార్వతి అయినా అంజుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో శోభన్ బాబు, చిరంజీవి వంటి పలు హీరోలతో నటించిన అంజు హీరోయిన్ గా దాదాపు అన్ని భాషలలో కలిపి 70 దాక సినిమాల్లో నటించిది. తెలుగులో నిరీక్షణ వంటి సినిమాలో నటించిన అంజు చాలా గ్యాప్ తరువాత శేషు లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన (Actress) పర్సనల్ లైఫ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అంజు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ అయిన అంజు కన్నడ సినిమాల్లో నటించే సమయంలో విలన్ గా అప్పటికే మంచి స్టార్ డమ్ ఉన్న నటుడు ప్రభాకర్ ప్రేమలో పడ్డారు. ఒక సినిమాలో ఇద్దరూ కలిసి పనిచేసినపుడు ఏర్పడిన పరిచయంతో టైగర్ ప్రభాకర్ ఆమెకు ప్రపోజ్ చేయడం, అంజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పడంతో ఆ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసేసుకున్నారు అంజు.

అయితే అప్పటికే ప్రభాకర్ కి ఒక పెళ్ళై విడాకులు తీసుకున్న విషయం తెలిసినా ప్రేమించారు. ఇద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ. పెళ్లి సమయానికి అంజు వయసు 18 ఏళ్ళు కాగా ప్రభాకర్ వయసు నలభై దాటేసింది. అయినా ఆయనను పెళ్లి చేసుకోడానికి పెద్దలను కాదని చేసుకున్న అంజు కి పెళ్ళైన తరువాతే అప్పటికే ప్రభాకర్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయనే విషయం తెలిసింది. మొదటి పెళ్లి మాత్రమే తెలిసిన అంజు షాక్ అయిందట.

ఇక మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో గొడవలు పెరిగి, ఉంటే సర్దుకుని ఉండు లేకపోతే వెళ్ళిపో అని భర్త నుండి సమాధానం రావడం, చాలా మంది అమ్మాయిలతో తనకు అఫైర్స్ ఉన్నాయనే విషయం తెలియడంతో ఇక ప్రభాకర్ తో ఉండాలేని అంజు అక్కడి నుండి పుట్టింటికి వచ్చేసారట. బాబు పుట్టాక ఒక్కసారిగా కూడా పలకరించలేదని, బాబును చూడలేదని ఆ బాధ, కోపం ఉన్నాయంటూ చెప్తారు అంజు. ఇక టైగర్ ప్రభాకర్ తన 48 ఏళ్ల వయసులో మరణించారు. అప్పటికి బాబు కి మూడు సంవత్సరాలు వయసు అందువల్ల తన తండ్రి గురించి ఏమి పెద్దగా తెలియదు. చనిపోయినపుడు చూడటానికి కూడా వెళ్ళలేదు అంటూ చెప్పారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus