Chanti Movie: ఆ ఒక్క రీజన్ తో వెంకటేష్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాని మిస్ చేసుకుందట..!

విక్టరీ వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంటి’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 వ సంవత్సరం జనవరి 10న విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ఈ ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా తెలుగులో ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.

అక్కడ పి.వాసు (Chanti Movie) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు దర్శకుడు రవిరాజా పినిశెట్టి చాలా మార్పులు చేయడం.. అలాగే వెంకటేష్ తన ఇమేజ్ ను పక్కన పెట్టి మరీ ఈ చిత్రంలో అద్భుతంగా నటించడంతో ‘చంటి’ సంచలనాలు సృష్టించింది. ఈ చిత్రంలో మీనా నటన కూడా హైలెట్ గా నిలిచింది. ఒక అమాయకురాలైన చెల్లెలికి ముగ్గురు క్రూర మృగాల్లాంటి అన్నయ్యలు ఉండటం.. అనుకోకుండా అమాయకుడైన హీరో అమాయకురాలైన హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం వంటి పాయింట్ అప్పటి జనాలకు చాలా కొత్తగా అనిపించింది.

ఇళయరాజా అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనా .. ఫస్ట్ ఛాయిస్ కాదట. ఓ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. మీనాని ఫైనల్ చేశారట. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు ఖుష్బూ. అవును.. ఈ చిత్రంలో నటించాలని దర్శకనిర్మాతలు ఆమెను కోరితే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నట్టు తాజాగా ఈమె చెప్పుకొచ్చింది.

దర్శకనిర్మాతలు మొదటిగా ఈమెను సంప్రదించడానికి కారణం.. ఒరిజినల్ లో అంటే ‘చిన్న తంబి’ లో కూడా హీరోయిన్ గా ఖుష్భూనే నటించడం వల్ల అని చెప్పాలి. అయితే మీనా కూడా ‘చంటి’ కి రైట్ సెలక్షన్ అని ప్రూవ్ చేసింది. ఆమె లుక్స్ కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus