Star Actress: 24 ఏళ్ళ నుండి.. ఆ విషయాన్ని మర్చిపోనివ్వడం లేదు: స్టార్ హీరోయిన్

  • May 17, 2023 / 11:16 AM IST

బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘యువరత్న రాణా’ చిత్రంలో చెల్లెలి పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా కాలం ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు.దానికి గల కారణాలేంటి అన్నది ఈమె ఎప్పుడూ రివీల్ చేయలేదు. అయితే గత ఏడాది వచ్చిన ‘రాధే శ్యామ్’ మూవీలో ప్రభాస్ తల్లిగా నటించింది. ఈ సినిమాలో ఓ పక్క అమ్మ ప్రేమను చూపిస్తూనే మరోపక్క క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టపడే గృహిణిగా కనిపించింది.

అలాగే ఇటీవల వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ‘ఛత్రపతి’ లో తల్లి పాత్ర పోషించింది. కానీ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో… ఆ పాత్ర వల్ల ఈమెకు కలిసొచ్చిందేమి లేదు. ఇదిలా ఉండగా.. గతంలో భాగ్యశ్రీ చాలా లవ్ స్టోరీస్ లో నటించింది. ఈమె పై చాలా రూమర్స్ వచ్చేవి. సరిగ్గా ఇలాగే.. సల్మాన్ ఖాన్ తో ‘మైనే ప్యార్ కియా’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న టైంలో.. అతనికి ఈమెకు అక్రమ సంబంధం ఉన్నట్టు ప్రచారం చేశారట.

1989 లో మొదలైన ప్రచారం 2023 వరకు ఆగలేదు అని (Star Actress) ఆమె చెప్పుకొచ్చింది. కావాలనే ఈమె గురించి అలాంటి నెగిటివ్ ప్రచారం చేశారని ఈమె చెప్పుకొచ్చింది. సినీ పత్రికలే అలాంటి ప్రచారం చేశాయని, అప్పటి నుండి అవి.. చదవడం.. మానేసినట్లు భాగ్య శ్రీ తెలిపింది. అంతేకాదు అలాంటి పాత్రలను తన ఇంట్లోకి రానివ్వకుండా చూసుకుంటానని కూడా ఈమె తెలిపింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus