300 మంది డ్యాన్సర్లు.. 99 టేక్‌లు… ఓ పాట కోసం ఎన్ని పాట్లో!

మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌.. వీళ్లను చూడటానికి, వాళ్ల గురించి మాట్లాడటానికి చాలా బాగుంటుంది కానీ.. వాళ్లతో పని చేయడం మాత్రం చాలా కష్టం. చిన్న పని చేసినా, చిన్న స్టెప్‌ వేసినా వాళ్ల పర్‌ఫెక్షనిజం ప్రాసెస్‌ బయటికొచ్చేస్తుంది. అలా వచ్చిన ఓ ముచ్చటైన కష్టం గురించి ప్రముఖ బాలీవుడ్‌ నటి రిచా చద్దా (Richa Chadha) చెప్పుకొచ్చింది. ఆమె ఓ ప్రధాన పాత్రధారిగా నటించిన ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌లో జరిగిన ఆసక్తికర విషయాలను ఆమె చెప్పుకొచ్చింది.

‘హీరామండి’ వెబ్‌సిరీస్‌లో ఒక డ్యాన్స్‌ సీన్‌ కోసం ఏకంగా 99 టేక్‌లు తీసుకుందట. ఈ విషయాన్ని ఆమే వెల్లడించింది. సినిమాలోని ఓ పాటలో అదితీరావ్‌ హైదరీ (Aditi Rao Hydari) సోనాక్షి సిన్హాతో (Sonakshi Sinha) కలసి డ్యాన్స్‌ చేస్తుంది రిచా చద్దా. ఆ సీన్‌ కోసం సోనాక్షి, అదితి 13, 14 టేక్‌లతో ఓకే చేసుకున్నారట. కానీ రిచా టేక్‌ ఎంతకీ ఓకే కాలేదట. చేసిన కొద్దీ టేక్‌లు చేయిస్తూనే ఉన్నారట. ఒకానొక సమంలో టేకుల్లో సెంచరీ కొడతానేమో అనిపించిందట ఆమెకు.

ఆ సీన్‌ కోసం 200 మంది నుండి 300 మంది వరకు డ్యాన్సర్లు పని చేస్తున్నారట. అంతమందితో సీన్‌ అన్నట్లు అన్నేసి టేకులు తీసుకోవడం రిచాకు ఇబ్బందిగా అనిపించిందట. అయితే మొత్తానికి 99వ షాట్‌తో ఓకే చెప్పారట దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ. దాంతో హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుందట. ఆ సినిమా షూటింగ్‌లో ఆ రోజును తన లైఫ్‌లో బెస్ట్‌, వరెస్ట్‌ డే అని చెప్పొచ్చు అని చెప్పింది.

ఇక ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 45కిపైగా దేశాల్లో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉందట. నాటి పరిస్థితుల్ని, జీవన విధానాన్ని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ చూపించిన విధానం.. నటీనటులు నటించిన విధానానికి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక్కడ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ సంజయ్‌ లీలా భన్సాలీ అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus