టెబుల్ కవర్ చుట్టుకొని డ్యాన్స్ చేసిన హీరోయిన్!

1989లో విడుదలైన శివ సినిమా షూట్ లో జరిగిన ఓ విషయాన్ని నటి శోభన తాజాగా బయట పెట్టారు. కాస్ట్యూమ్స్ వల్ల తాను ఇబ్బందిపడ్దానని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా దక్షిణాది భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు శోభన . నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్గానూ గుర్తింపు తెచ్చుకున్న శోభన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్, ముఖ్యంగా రజనీకాంత్ తో వర్క్ చేయడంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తమిళంలో తెరకెక్కిన ‘శివ’ సినిమా షూట్లో జరిగిన ఓ విషయాన్ని ఆమె బయటపెట్టారు. “రజనీకాంత్ ఎంతో మంచి వ్యక్తి. నిజంగానే ఆయన ఒక జెంటిల్ మ్యాన్. మేమిద్దరం కలిసి ‘శివ’, ‘దళపతి’ సినిమాల్లో నటించాం. ‘శివ’ షూట్ అప్పుడు ఆయన నాకెంతో సాయం చేశారు. ఓ సారి మా ఇద్దరిపై వర్షం పాట చిత్రీకరించడానికి సెట్ వేశారు. సెట్స్లోలో ఉన్న వారందరికీ ఆ విషయం తెలుసు. నాకు తప్ప. శరీరం కనిపించేలా ఉన్న ఓ తెల్ల చీర ఇచ్చి కట్టుకోమన్నారు.

ఆ కాస్ట్యూమ్ చూడగానే రెయిన్సాంగ్ అని అర్థమైంది. దాంతో కాస్ట్యూమ్ బాయ్ని పిలిచి.. ఈ చీర బాగా పల్చగా ఉంది. ఇంటికి వెళ్లి.. శరీరం కనిపించకుండా ఉండేందుకు ఏదైనా ధరించి దానిపై చీర కట్టుకుని వస్తా’ అని చెప్పా. అయితే, షూట్ మొదలు కావడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ఏం చేయాలో అర్ధం కాలేదు. స్టూడియోలో ఉన్న ఓ టేబుల్ కవర్ని ఒంటికి చుట్టుకుని..

దానిపై చీర కట్టుకుని సెట్లోకి అడుగుపెట్టా డ్యాన్స్ చేస్తున్నప్పుడు కవర్ వల్ల వచ్చిన సౌండ్కు రజనీకాంత్ ఇబ్బందిపడ్డారు. కానీ, ఆయన ఏమీ అనలేదు. ఆరోజు నేను టేబుల్ కవర్ ధరించానని ఎవరికీ తెలియదు. నాకు తెలిసి రెయిన్ సాంగ్స్ అంటే హీరోయిన్స్ను మర్జర్ చేసినట్టే ఎందుకంటే చివరి వరకూ వాళ్లకా | విషయం తెలియదు” అని శోభన అన్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus