స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాలతో చెడుగుడు ఆడుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను ఫైర్‌బ్రాండ్‌ అంటుంటారు. ఆమె ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. కానీ ఆమె ఎవ్వరినీ లెక్క చేయదు. అవతలి వ్యక్తి ఎంత పెద్ద పలుకుబడి ఉన్నవాడు అయినా సరే అతని పై నోరు పారేసుకోవడం ఈమె స్టైల్. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు ఓ పక్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర పై హోస్ట్ గా కూడా రాణిస్తుంది.

Click Here To Watch NOW

‘లాకప్‌’ అనే రియాల్టీ షోకు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కాన్సెప్ట్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్‌లు తమ జీవితంలో ఎదుర్కొన్న సంగతులను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు.అవి వింటున్నప్పుడు సెలబ్రిటీల జీవితాల్లో ఇంత ట్రాజెడీ ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. తాజా ఎపిసోడ్ లో కంగనా… కంటెస్టెంట్‌లు ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి చెప్పుకునేలా ఓ టాస్క్ ఇచ్చింది.

ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కూడా చెప్పుకొచ్చింది. ‘ఈ సమాజంలో చాలా మంది చిన్న పిల్లలు ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతూ వస్తున్నారు. పిల్లల పెంపకం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నాకు కూడా బాల్యంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా విలేజ్ లో ఉండే ఒక అబ్బాయి మాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.

అతను మాకంటే 4 ఏళ్ళు మాత్రమే పెద్దవాడు. మా ఫ్రెండ్స్ తో మేము ఆడుకుంటున్న టైములో అతను వచ్చి ఇబ్బందికరంగా తాకేవాడు. ఆ టైములో మేము లైంగికంగా బాధింపబడుతున్నామని మాకు తెలీదు.కానీ ఇబ్బందికరంగా ఉండేది’ అంటూ కంగనా రనౌత్‌ చెప్పుకొచ్చింది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus