ఏ సినిమా అయినా సరే స్టార్ట్ అవ్వడానికి ముందు స్మోకింగ్ యాడ్ వేస్తారు. ‘మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ సినీ నటులు వాయిస్ లతో చెప్పిస్తారు. కానీ నిజ జీవితంలో ఆ మాటలు ఎక్కువ మంది పాటించరు. సినిమా వాళ్ళు అనే కాదు బయట చాలా మంది ఈ యాడ్ చూసినా లైట్ తీసుకుంటున్నారు. సరే ఒకప్పుడు సినిమా వాళ్ళు రహస్యంగా మద్యం సేవించేవారు. ఇప్పుడు అలాంటి విషయాలపై ఎవ్వరూ చాటుగా వ్యవహరించడం లేదు.
బహిరంగంగానే బయటపడిపోతున్నారు. ఇండస్ట్రీలో ఉండే మేల్ యాక్టర్స్ మాత్రమే కాదు ఫిమేల్ యాక్టర్స్ కూడా మద్యం సేవిస్తున్నారు. అందుకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఓ హీరోయిన్.. ఈ విషయాన్ని నేరుగా అంగీకరించింది. ఆమె మరెవరో కాదు మహేష్ భట్ కూతురు పూజా భట్. ఈమె మద్యానికి బానిసై నట్టు తాజాగా చెప్పి షాకిచ్చింది. ఈమె పలు హిట్ సినిమాల్లో నటించింది. తన తండ్రిలానే డైరెక్షన్ కూడా చేసింది .
‘డాడీ’ సినిమాతో నటిగా (Actress) ఎంట్రీ ఇచ్చింది. దానికి కూడా మహేష్ భట్ డైరెక్ట్ చేయడం జరిగింది. తాజాగా హిందీ బిగ్ బాస్ ఒటిటి2 సీజన్ లో ఈమె పాల్గొంది. ఇందులో ఓ టాస్క్ లో భాగంగా.. ‘నాకు ఓ చెడ్డ అలవాటు ఉంది. అదే మద్యం సేవించడం. నేను ఎక్కువగా మందు కొట్టేదాన్ని. రాను రాను అది నాకు వ్యసనంగా కూడా మారింది.అయితే నాకు 44 ఏళ్లు వచ్చాక ఆ వ్యసనాన్ని వదిలించుకొన్నాను. అంటూ ఈమె చెప్పుకొచ్చింది.