అమ్మాయిలకు అలాంటి అబ్బాయిలే కావాలి.. నటి షాకింగ్ కామెంట్స్!

దేశంలో అమ్మాయిలు, అబ్బాయిలకు సంబంధించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అమ్మాయిలు, అబ్బాయిలు మారుతుండటం గమనార్హం. అయితే తాజాగా ప్రముఖ నటి దేశంలో అమ్మాయిలు సోమరితనంతో ఉన్నారని కామెంట్ చేయగా ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాండిల్ వుడ్ సినిమాలతో సోనాలి కులకర్ణి కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సోనాలి కులకర్ణికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నటి తన సినీ కెరీర్ లో 65 కంటే ఎక్కువ సినిమాలలో నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.

అయితే సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా అమ్మాయిలకు అనుకూలంగా కామెంట్లు చేయడం జరుగుతుంది. అయితే ఈ హీరోయిన్ మాత్రం అమ్మాయిలకు వ్యతిరేకంగా కామెంట్లు చేసింది. దేశంలోని అమ్మాయిలలో చాలామంది అమ్మాయిలు సోమరితనంతో ఉన్నారని ఆమె కామెంట్లు చేశారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన యువకులు ఫ్యామిలీకి ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయంలో విపరీతమైన ప్రెజర్ ను ఎదుర్కొంటున్నారని సోనాలి కులకర్ణి పేర్కొన్నారు.

పెళ్లి విషయంలో అమ్మాయిలు చేసుకునే అబ్బాయికి ఇల్లు ఉందా? ఎక్కువ వేతనం వస్తుందా? అని చూస్తున్నారని ఆమె తెలిపారు. అమ్మాయిలకు కావాల్సింది మంచి ఆఫర్లా? మంచి అబ్బాయిలా అని ఆమె ప్రశ్నించారు. అమ్మాయైనా అబ్బాయైనా కష్టసుఖాలను సమానంగా పంచుకోవాలని సోనాలి కులకర్ణి అన్నారు. అమ్మాయిలు అన్నీ వదిలేసి పనికిమాలిన సమస్యల కొరకు మానవ హక్కుల సిబ్బంది దగ్గరకు వెళుతున్నారని సోనాలి కులకర్ణి వెల్లడించారు.

ఆమె చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సోనాలి కులకర్ణి కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయిలలో ఎక్కువమంది ఈ కామెంట్ల విషయంలో నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అబ్బాయిలలో మాత్రం సోనాలి కులకర్ణిపై పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సోనాలి కులకర్ణి కామెంట్లకు అబ్బాయిల నుంచి మాత్రం మద్దతు దక్కుతోంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus