బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళకి పెద్ద విషయం కాదు. హీరో, హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లలో హగ్గులు ఇచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం అనేది వాళ్ళకి చాలా చిన్న విషయం. అందుకే అక్కడి మేకర్స్ బోల్డ్ కంటెంట్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది నిజం. అయితే బాలీవుడ్ కి బోల్డ్ కంటెంట్ ను పరిచయం చేసింది.. సీనియర్ దర్శకుడు మహేష్ భట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయినప్పటికీ ఆయన సినిమాలు సక్సెస్ అయ్యాయి. స్టార్ డైరెక్టర్ గా ఆయన నిలబడ్డారు. అయితే కొన్నేళ్ల క్రితం.. మహేష్ భట్ తన కూతురు పూజా భట్ కి లిప్ కిస్ ఇచ్చారు. ఇది బాలీవుడ్ జనాలకి సైతం పెద్ద షాకిచ్చింది అని చెప్పాలి. దీనిపై తండ్రి కూతుర్లు ఎప్పుడూ స్పందించింది అంటూ ఏమీ లేదు. అయితే పూజా భట్ రీ ఎంట్రీ ఇచ్చి బోల్డ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంలో ఆమె (Actress) ఈ వివాదం పై స్పందిస్తూ “ ‘కన్న తండ్రితో లిప్ లాక్( కిస్) ఏంటి? అంటూ అప్పట్లో నన్ను చాలా ఘోరంగా తిట్టారు. దానికి నేను బాధపడిన మాట నిజం. అయితే.. ఒక్క విషయం.. తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎప్పుడూ చిన్న పిల్లలే. నా తండ్రికి నాకు మధ్య ఆ ఉద్దేశంతోనే లిప్ కిస్ పెట్టుకోవడం అనేది జరిగింది. అంతే తప్ప వేరే ఏమీ లేదు. దీని గురించి ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని విమర్శలు ఎదురైనా.. నేను అస్సలు పట్టించుకోలేదు.పట్టించుకోను” అంటూ పూజా భట్ చెప్పుకొచ్చింది.