టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో సెంథిల్ కుమార్ ఒకరు కాగా ఆయన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సెంథిల్ కుమార్ భార్య రూహీ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రూహీ మరణం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ప్రొఫెషనల్ యోగా టీచర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న రూహీకి కరోనా సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలుస్తోంది.
అప్పటినుంచి ఆమె వేర్వేరు సమస్యలతో పోరాడుతూ వైద్య చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. శరీరంలోని అవయవాలు దెబ్బ తినడంతో హైదరాబాద్ లో ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రూహీ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సెంథిల్, అతని కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు రూహీ అంత్యక్రియలు జరగనున్నాయి. సెంథిల్ కుమార్ కెరీర్ పరంగా సక్సెస్ కావడంలో రూహీ పాత్ర ఎంతో ఉంది. సెంథిల్ కుమార్ అమృతం సీరియల్ లోని కొన్ని ఎపిసోడ్లకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయడంతో పాటు రాజమౌళి సినిమాలలో మెజారిటీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. త్వరలో సెంథిల్ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టనున్నారని వార్తలు వినిపించాయి.
2009 సంవత్సరంలో సెంథిల్, రూహీ వివాహం చేసుకున్నారు. చిన్న వయస్సులోనే సెంథిల్ భార్య రూహీ మరణించడం సినీ అభిమానులను ఎంతో బాధ పెడుతోంది. సెంథిల్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారని భోగట్టా. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రూహీ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. యోగా పాఠాలు చెప్పడం ద్వారా ఫేమస్ అయిన రూహీ ప్రముఖ సినీ నటి అనుష్కకు కూడా సన్నిహితురాలు అని సమాచారం అందుతోంది.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!