RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పాటపై ప్రముఖ వ్యాపారవేత్త కామెంట్స్‌ వైరల్‌!

నాటు..నాటు అలియాస్‌ నాచో నాచో… మొత్తం భారతదేశాన్ని ఓ ఊపు ఊపిన పాట ఇది. రామ్‌చరణ్‌, తారక్‌ కలసి స్క్రీన్‌ మీద దుమ్ము రేపితే, ఫ్యాన్స్‌ బయట డ్యాన్స్‌ వేస్తూ అదరగొడుతున్నారు. ఈ పాటను యూట్యూబ్‌లో చూసి ఎంతమంది ఫిదా అయ్యారో తెలియదు కానీ, తెరపై మీద కళ్లప్పగించి చూసేవాళ్లు ఇంకా ఎక్కువమంది ఉంటారు. అలాంటివారందరికీ ప్రముఖ వ్యాపారవేత్త క్యాప్‌జెమినీ అధినేత పాల్ హెర్మెలిన్ ఓ సవాలు విసిరారు. వృత్తిపరమైన పనుల నిమిత్తం భారతదేశానికి వచ్చిన పాల్ హెర్మెలిన్ స్నేహితుడి సలహా మేరకు ‘నాటు నాటు…’ పాటను వీక్షించారట.

ఆ తర్వాత పాట గురించి స్పందిస్తూ… ‘‘రెండేళ్ల తర్వాత భారత్‌కు వచ్చి మూడు రోజులపాటు బిజినెస్‌ పనులు చూసుకున్నాను. ఇప్పుడు తిరిగి స్వదేశానికి ప్రయాణమయ్యాను. ఇటీవల విడుదలైన భారతీయ చిత్రాల్లోని ఏదైనా సూపర్‌ హిట్‌ సాంగ్‌ వినాలని అనిపించింది. దీంతో నా స్నేహితుడు మురళీ ఇచ్చిన సూచనతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాచో నాచో…’ వీడియో సాంగ్‌ చూశాను’’అని పేర్కొన్నారు పాల్ హెర్మెలిన్. ఆ పాట చూసిన తర్వాత తనకు కలిగిన అభిప్రాయాన్ని పాల్ హెర్మెలిన్ లింక్డ్‌ఇన్‌లో పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఇది కేవలం పాట మాత్రమే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ఆచారంలా మారిపోయింది. ఉత్సవంలా తయారైంది అని పేర్కొన్నారు పాల్ హెర్మెలిన్. నా భారతీయ మిత్రులందరి నుంచి ఈ వారం ‘నాటు నాటు..’ పాట వీడియోలను ఆహ్వానిస్తున్నా అంటూ పాల్ హెర్మెలిన్ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక పాన్‌ ఇండియా రేంజిలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా… ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

రామ్‌చరణ్‌, తారక్‌ నటనకు, వారి హీరోయిజానికి కోట్ల వర్షం థియేటర్లలో కురిసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అదే రేంజిలో రెస్పాన్స్‌ వస్తోంది. సుమారు రూ.450 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. విదేశాల్లో విడుదల చేస్తే ఈ వసూళ్లు ఇంకా పెరుగుతాయని అంటున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus