సినీ పరిశ్రమలో ప్రేమ, డేటింగ్, పెళ్లి, విడాకులు వంటి వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవే. అదేంటో కానీ ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే.. విడాకులు తీసుకుంటున్న సందర్భాలు అనేకం చూశాం. పెళ్ళైన ఏడాదికే విడాకులకు అప్లై చేసిన జంటలు కూడా చాలా ఉన్నాయి అంటే అతిశయోక్తి అనిపించుకోదు. తాజాగా అమెరికన్ నటి నటాలీ పోర్ట్మన్- కొరియోగ్రాఫర్ బెంజమిన్ మిల్లెపిడ్ విడాకుల వ్యవహారం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. బెంజమిన్ మరో మహిళతో ఎఫైర్ పెట్టుకుని పడక సుఖాలు అనుభవిస్తున్నాడట.
అందుకే నటాలీ అతనితో విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోవాలని డిసైడ్ అయ్యింది. ఆల్రెడీ ఈ విషయాన్ని తన స్నేహితులు,బెంజమిన్ కి కూడా చెప్పినట్టు టాక్ నడుస్తుంది. 11 ఏళ్ళ పాటు కలిసి కాపురం చేసిన ‘నటాలీ పోర్ట్మన్-బెంజమిన్ మిల్లెపిడ్ విడిపోవడానికి రెడీ అయ్యారు. క్లైమెట్ యాక్టివిస్ట్ కెమిల్లె ఎటియెన్తో బెంజమిన్ పడక సుఖానికి అలవాటు పడినట్టు ఆమె (Star Couple) వద్ద ఆధారాలు కూడా ఉన్నాయట. అతను తప్పు చేసిన విషయాన్ని నేరుగా చెప్పి..
క్షమించినా అతను మారలేదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో నటాలీ ఇలాంటి సీరియస్ డెసిషన్ తీసుకుంది.నటాలీ ప్రస్తుతం తన పిల్లలతో కలిసి సెపరేట్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను మీడియాతో షేర్ చేసుకుని తమ పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది కలిగించే ఉద్దేశం ఆమెకు లేదట. అందుకే మీడియాకి నేరుగా ఈ విషయం పై ఏమీ స్పందించడం లేదు. నటాలీ -బెంజమిన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరి వయసు 12, మరొకరి వయసు 6 ఏళ్ళు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!