ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్ కామన్ అయిపోయాయి.. ఎంత త్వరగా రిలేషన్ స్టార్ట్ చేసి.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. అంతే త్వరగా విడిపోతున్నారు.. సెలబ్రిటీల వ్యవహారం చూసి.. వీళ్లకి ప్రేమ, పెళ్లి అంటే ఎంత చులకన అయిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. బాలీవుడ్‌లో ఈ తరహా వ్యవహారాలు కొంచెం ఎక్కువనే చెప్పాలి.. ఈ బ్రేకప్ లిస్టులో మరో జంట వచ్చి చేరింది.. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుని.. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన కపుల్ కాస్తా..

నీ దారి నీది.. నా దారి నాది అంటూ తట్టా బుట్టా సర్దేసుకున్నారు.. విద్యుత్ జమ్వాల్.. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాతో నటుడిగా మారాడు.. తర్వాత ‘ఊసరవెల్లి’లోనూ విలన్‌గా కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు.. తమిళ్‌లో ‘బిల్లా 2’, ‘తుపాకీ’ లాంటి చిత్రాలు చేశాడు.. టాలీవుడ్, కోలీవుడ్‌లో విలన్‌గా నటించి.. బాలీవుడ్‌లో హీరోగా మారిపోయాడు.. హిందీలో ‘కమాండో’ సిరీస్‌తో హిట్స్ మీద హిట్స్ కొట్టాడు..

‘ఖుదా హఫీజ్’ అనే మరో మూవీ సిరీస్‌తో పాటు ‘జంగ్‌లీ’ లోనూ విద్యుత్ హీరోగా నటించాడు.. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇదిలా ఉంటే.. విద్యుత్ ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీతో మూడేళ్ల క్రితం ప్యార్‌లో పడ్డాడు.. ఆ తర్వాత 2021 సెప్టెంబరులో వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.. తమ ప్రేమని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, పోస్టులు పెట్టిన ఈ ప్రేమ పక్షులు.. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు..

రీసెంట్‌గా అనన్య పాండే పెళ్లికి అటెండ్ అయిన విద్యుత్, నందిత ఎడమొహం పెడమొహంగా కనిపించారు.. ఇది గమనించిన చాలామంది నెటిజన్స్.. ఈ జోడీ బ్రేకప్ గురించి కామెంట్స్ చేస్తున్నారు.కాగా నందితా మహ్తానీకి ఇప్పటికే ఓసారి పెళ్లి, విడాకులు జరిగాయి.. రణ్‌బీర్ కపూర్, డినో మోరియా లాంటి బాలీవుడ్ హీరోలతో రిలేషన్ షిప్ మెయింటెన్ చేసింది కూడా.. ఇప్పుడు విద్యుత్ కూడా ఆమెకు బ్రేకప్ చెప్పడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus