సినిమా తారలు, పొలిటికల్‌ లీడర్లపై స్టార్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్‌ ఆగ్రహం!

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా దుబాయిలో ఆదివారం జరిగిన భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ భలే రంజుగా సాగింది. సినిమా + క్రికెట్‌ కాంబినేషన్‌ ఫ్యాన్స్‌కి కూడా నిన్న పండగే. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి పెద్దగా మైదానానికి రాని చాలామంది సెలబ్రిటీలు నిన్న మ్యాచ్‌ కోసం దుబాయి వెళ్లి మరీ చూశారు. వాళ్లను చూసి ఫ్యాన్స్‌ మురిసిపోయారు. అయితే ఈ క్రమంలో మాజీ క్రికెటర్‌, తెలుగు వాడు అంబటి తిరుపతి రాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Stars

అభిమానులు అయితే రాయుడుని తిట్టిపోస్తున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే ఆ మాటలకు నవ్వుకుంటున్నారు. సినిమాల ద్వారా, రాజకీయాలతో ప్రపంచానికి బాగా పరిచయం ఉన్న, పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలను (Stars) తక్కువ చేస్తూ రాయుడు కొన్ని కామెంట్స్‌ చేశాడు. టీవీల్లో కనిపించడానికి వచ్చారు, అలా పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తున్నారు అని రాయుడు కామెంట్స్‌ చేశారు. దీంతో రాయుడు ఎందుకు అలా అన్నాడు, అసలు అలాంటి మాటలు అనేవాడు కాదు అని అతని మద్దతుదారులు చెబుతున్నారు.

ఇంతకీ ఏమైందంటే.. పాకిస్థాన్‌తో భారత్‌ ఆడిన మ్యాచ్‌ను చూడటానికి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), స్టార్‌ (Stars)  దర్శకుడు సుకుమార్‌, (Sukumar) ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, ఏపీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు కేశినాని చిన్ని ఇలా చాలామంది ప్రముఖులు మైదానానికి వచ్చారు. మ్యాచ్‌ను చూసి ఎంజాయ్‌ చేశారు. ఈ క్రమంలో తెలుగు కామెంటేటర్లు వచ్చినవాళ్ల పేర్లు చెబుతూ ఏదో మాట్లాడబోయారు. దానికి రాయుడు రిప్లై ఇస్తూ.. ‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కదా టీవీలో ఎక్కువ సేపు కనిపిస్తామని వస్తుంటారు.

ఇదంతా ఓ పబ్లిసిటీ స్టంట్‌’ అని అన్నారు. అక్కడ ఉన్న మిగిలిన కామెంటేటర్లు కూడా నవ్వేశారు. నిజానికి వచ్చిన ప్రముఖులు అంతా టీవీల్లో కనిపించి సెలబ్రిటీలు అవ్వాలని, స్టంట్‌లు చేసే స్టేచర్‌ ఉన్నవాళ్లు కాదు. వాళ్లు ఇప్పటికే స్టార్లు. అలాంటి వాళ్ల గురించి రాయుడు అలా అనడం సరికాదు. ఇక మరో యాంగిల్‌ చూస్తే పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan)  అంబటి రాయుడు చాలా క్లోజ్‌. అలాంటి ఆయన చిరంజీవిని అలా అంటారా? అనేదీ చర్చనీయాంశమే.

నితిన్ కి లైఫ్ ఇచ్చిన ‘ఇష్క్’ కి 13 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus