‘సై’ (Sye) తర్వాత నితిన్ (Nithin Kumar) 10 ప్లాపులు ఫేస్ చేశాడు. స్టార్ హీరో అయితే తప్ప… ఓ మాదిరి హీరోలు అన్ని ప్లాపులు పడ్డాక…నిలబడటం కష్టం. అలాంటి టైంలో ‘ఇష్క్’ (Ishq) అనే సినిమా వస్తుంది అంటే మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ అయినా ఉంటాయా? పైగా ఎప్పుడో ‘ఇష్టం’ (Ishtam) అనే ప్లాప్ సినిమా తీసిన దర్శకుడు చేసిన సినిమా ఇది. అలాంటి టైంలో ఈ సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెస్ట్ గా వెళ్లడంతో.. పవన్ అభిమానులు ఈ సినిమాని బాగా సపోర్ట్ చేశారు.
దీంతో 2012 ఫిబ్రవరి 24న విడుదలైన ‘ఇష్క్’ కి జనాలు వెళ్లారు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం, పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీతో పాటు విక్రమ్ కుమార్ (Vikram kumar) డైరెక్షన్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. దీంతో అన్ సీజన్లో కూడా ‘ఇష్క్’ కి మంచి వసూళ్లు వచ్చాయి. నేటితో ఈ చిత్రం విడుదలై 13 ఏళ్ళు పూర్తవుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో.. ఒక లుక్కేద్దాం రండి :
నైజాం | 3.60 cr |
సీడెడ్ | 1.10 cr |
ఉత్తరాంధ్ర | 1.30 cr |
ఈస్ట్ | 0.42 cr |
వెస్ట్ | 0.39 cr |
గుంటూరు | 0.71 cr |
కృష్ణా | 0.53 cr |
నెల్లూరు | 0.26 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.31 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.46 cr |
‘ఇష్క్’ చిత్రం రూ.5.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.10.46 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా బయ్యర్లకి రూ.4.6 కోట్ల వరకు లాభాలు అందించింది. ఇటీవల ‘ఇష్క్’ రీ రిలీజ్ అవ్వగా… జనాలు భారీగా థియేటర్లకు వెళ్లిన సంగతి తెలిసిందే.