Prabhas engagement: ఆ హీరోయిన్ కు ప్రపోజ్ చేసిన ప్రభాస్.. క్రిటిక్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్త వినాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 43 సంవత్సరాలు కాగా ప్రభాస్ కంటే ఆలస్యంగా పెళ్లి చేసుకున్న హీరోలలో చాలామంది ఇప్పటికే పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా ప్రభాస్ కృతిసనన్ ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేయగా

ఆ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఉమైర్ సంధు తన పోస్ట్ లో అతి త్వరలో ప్రభాస్ కృతిసనన్ ల నిశ్చితార్థం జరగనుందని చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్ కృతిసనన్ కు తన మనస్సులోని ప్రేమను వెల్లడించాడని ఉమైర్ సంధు పేర్కొన్నారు. ప్రభాస్ ప్రేమను కృతిసనన్ యాక్సెప్ట్ చేసిందని ప్రస్తుతం ప్రభాస్ కృతిసనన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఉమైర్ సంధు వెల్లడించారు.

వినడానికి ప్రభాస్ అభిమానులకు షాకింగ్ గా అనిపించినా ఈ వార్త నిజం అయితే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలో ప్రభాస్ కృతిసనన్ ఎంగేజ్మెంట్ జరగనుందని ఉమైర్ సంధు పేర్కొన్నారు. ఈ వార్తల గురించి ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి.

గతంలో ప్రభాస్ అనుష పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపించినా ఆ వార్తలు నిజం కాకపోవడంతో ప్రభాస్ అభిమానులు సైతం బాధ పడ్డారు. ప్రభాస్ కృతిసనన్ జోడీ బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండగా ఈ రీల్ జోడీ రియల్ జోడీ అవుతారో లేదో చూడాల్సి ఉంది. ప్రభాస్ నటించిన సలార్ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus