ఓ ప్రముఖ దర్శకుడు మహిళ పై రేప్ అటెంప్ట్ చేశాడంటూ కేసు ఫైల్ అవ్వడం, అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే..మలయాళం స్టార్ హీరో నివిన్ పౌలి హీరోగా ‘పడవెట్టు’ అనే చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు లిజు కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్ పై ఉంది. అయితే అనూహ్యంగా లిజు కృష్ణ ‘నా పై అత్యాచారం చేశాడు, లైంగికంగా వేధించాడు’ అంటూ ఓ మహిళ కేసు పెట్టింది.
దీంతో కక్కండ్ ఇన్ఫో పార్క్ పోలీసులు వెంటనే ఆమె కంప్లైంట్ ను స్వీకరించి… ఐపిసి 376 సెక్షన్ ప్రకారం… కన్నూర్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో లీజు కృష్ణను అరెస్ట్ చేసారు. దీంతో ఒక్కసారిగా మలయాళం సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. లిజు కృష్ణ అరెస్టు పోలీసులు అప్పుడే ఏ విషయాలు చెప్పలేమని వెల్లడించారు. సోమవారం (ఈ రోజు, ఫిబ్రవరి 7న) కొచ్చిలోని కోర్టులో ఆయన్ను హాజరు పరచనున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే.. కేరళలో టాటూ ఆర్టిస్ట్ సుజీత్ పీఎస్ పై ఏకంగా ఆరుగురు మహిళలు లైంగిక వేధింపుల కేసు పెట్టినట్టు సమాచారం. దీని పై కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ‘పడవెట్టు’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో హీరో నివిన్ పౌలితో పాటు మంజూ వారియర్, అదితి బాలన్ లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీని లిజు కృష్ణ తన సొంత కథతో తెరకెక్కిస్తున్నాడు. సన్నీ వేన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే అనూహ్యంగా దర్శకుడు అరెస్ట్ అవ్వడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!