ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ మధ్యనే 20 ఏళ్లు పూర్తయింది. అతని మొదటి సినిమా ‘ఈశ్వర్’ నాటి జ్ఞాపకాలను కూడా అభిమానులు నెమరువేసుకున్నారు. ఇది బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా కాదు కానీ.. మొదటి సినిమాకే ప్రభాస్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు అనే పేరు సంపాదించుకున్నాడు. ఓవరాల్ గా ఈ మూవీ బాగానే ఆడింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ద్వారా ఓ స్టార్ డైరెక్టర్ విలన్ గా ఎంట్రీ ఇవ్వాలట.
కానీ చివరి నిమిషంలో అతను నొ చెప్పి తప్పుకున్నాడట. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు రవిరాజా పినిశెట్టి. ఒకప్పుడు టాలీవుడ్ కు ఇండస్ట్రీ హిట్లు అందించిన దర్శకుడు అతను. ఇతన్ని నటుడిని చేద్దాం అని ఈశ్వర్ దర్శకుడు జయంత్ అనుకున్నాడట. కానీ కుదర్లేదు అని జయంత్ చెప్పాడు. జయంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” ‘ఈశ్వర్’ లో విలన్ గా ముందు రవిరాజా పినిశెట్టి గారిని అనుకున్నాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం.
నేను ఆయనతో కలిసి పనిచేసింది లేదు. కానీ ఆయన్ని ఎక్కువగా కలిసే వాడిని. వెంకటేష్- సుమన్ నటించిన ‘కొండపల్లి రాజా’ సినిమా షూటింగ్ టైంలో నేను మొదటిసారి ఆయన్ని కలిశాను. రవిరాజా పినిశెట్టి గారిలో ఒక స్టైల్, ఒక ఆటిట్యూడ్, ఒక గ్రేస్ కనిపించేవి. నాకు ఆయన ఒక సంజయ్ దత్ లా కనిపించేవారు. ఆయన స్మోకింగ్ స్టైల్ కూడా నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా సరే ఆయన్ని కెమెరా ముందుకు తీసుకురావాలి అని నేను అనుకున్నాను.
‘ఈశ్వర్’ కోసం ఆయన్ని నేను కన్విన్స్ చేశాను. ఆయన ఒప్పుకున్నారు చేయడానికి. కాస్ట్యూమ్ ట్రయల్స్, లుక్ టెస్ట్.. అన్నీ చేసేశాం. ఉదయం షూటింగ్ అనగా ఆయన భయపడిపోయి… ‘నేను లాస్ట్ మినిట్ లో ఇలా చెబుతున్నందుకు సారీ. నేను సరిగా చేయకపోతే.. నీకు నాకు కూడా ఇబ్బందే.’ అని అన్నాడు. సరే అని ఆయన డెసిషన్ కు రెస్పెక్ట్ ఇచ్చి.. టైం లేక నా నిర్మాత అశోక్ నే విలన్ గా పెట్టేశాను” అంటూ తెలియజేశాడు.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!