నెపోటిజం అనే పదం మొన్నామధ్య బాగా పాపులర్ అయ్యింది.స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్న టైంలో బాలీవుడ్ ప్రేక్షకులు టాలెంట్ ఉన్న వారిని పైకి రానివ్వడం లేదు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకంటే.. కరణ్ జోహార్ గతంలో అనుష్క శర్మ కెరీర్ ను కూడా అంతం చేయాలనుకున్నాడు అనే డిస్కషన్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి! ఆమె కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చింది. ఆమె టాలెంట్ వల్లే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
మొదట్లో ఆమెకు అవకాశం ఇవ్వకూడదు అని కరణ్ భావించాడట. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘రబ్ నే బనాదీ జోడీ’ సినిమాలో హీరోయిన్ గా అనుష్క శర్మని తీసుకుందామని ఆదిత్య చోప్రా ఫోటో చూపిస్తే… అది చూసిన కరణ్.. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆమె వద్దే వద్దు’ అని చెప్పాడట. ‘అనుష్క కి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అవసరమే లేదు. వేరే హీరోయిన్ కు అవకాశం ఇద్దాం అనుకున్నాను. తెర వెనుక ఆమెను తప్పించే ప్రయత్నాలు కూడా చేశాను.
సినిమా రిలీజయ్యాక అయిష్టంగానే చూశాను. కానీ ‘బ్యాండ్ బాజా భారత్’ మూవీ చూశాక తన నటనకు ఇంప్రెస్ అయ్యా. ఇంత మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలనుకున్నానా అనే గిల్టీతో క్షమాపణలు చెప్పాను. ‘చాలా బాగా చేశావని అనుష్కను మెచ్చుకున్నాను’ అంటూ .. . 2016 లో 18వ ఎమ్ ఎమ్ఐ ముంబై ఫిలిం ఫెస్టివల్ లో కరణ్ స్టేజ్ పై ఈ వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియో చూసిన అపూర్వ అస్రానీ ట్విటర్లో షేర్ చేశాడు.
‘కరణ్ జోహార్ (Director) అనుష్క శర్మ కెరీర్ ను నాశనం చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతనే గతంలో చెప్పుకొచ్చాడు. నాకు తెలిసి ఇన్సైడర్, అవుట్ సైడర్ అన్నది ఇప్పటికీ చర్చించాల్సిన అంశమే’ అంటూ పేర్కొన్నాడు అపూర్వ. దీనికి కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. ‘మంచి కెరీర్ ఇవ్వడం లేదా అంతం చేయడమే కొందరి హాబీ. ప్రతిభావంతులైన బయటివారిపై కొందరు డర్టీ పాలిటిక్స్ చేయడం వల్లే బాలీవుడ్ ఇలా తయారైంది’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు.ఇలా ఎప్పుడో వీడియో వల్ల ఇప్పుడు మళ్ళీ కాంట్రోవర్సీ మొదలైంది.