రాజేంద్ర ప్రసాద్ ఈయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, గుడివాడకు చెందిన ఈయన సీనియర్ ఎన్. టి. ఆర్ స్ఫూర్తితో సినిమాల పై వ్యామోహం పెంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆరే ఈయన్ని యాక్టింగ్ స్కూల్ లో చేర్పించారు. అయితే మొదట్లో రాజేంద్ర ప్రసాద్ కు అవకాశాలు రాలేదు. దీంతో ఒకానొక టైంలో సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. అయితే చివరి ప్రయత్నంగా ఒకసారి ట్రై చేస్తే అవకాశం దొరికింది.
చనిపోవడానికి రెడీ అయిపోయిన వ్యక్తి కాబట్టి.. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తిరిగి చూడడానికి ఈయన ఇష్టపడలేదు.ఆ స్వభావమే ఇతన్ని స్టార్ ను చేసింది. ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగడానికి సాయపడింది. రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అంతకు మించి ఈయన గురించి చెప్పుకోవాలి అంటే ఎంతో మంది దర్శకులకు, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు.. వాళ్ళు స్టార్లుగా ఎదిగారు. అయితే సినిమాల ద్వారా కడుపుబ్బా నవ్వించే రాజేంద్ర ప్రసాద్..
నిజజీవితంలో మాత్రం కోపిష్టి అని చాలా మంది అంటుంటారు. ఇప్పటి దర్శకులు అయితే రాజేంద్ర ప్రసాద్ గురించి ఇంకో రెండు ఎక్కువేసే చెబుతుంటారు. అయితే రాజేంద్ర ప్రసాద్ తో ‘భలే మొగుడు’ ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాత్రం అది వట్టి అపోహ అని చెబుతున్నారు. ‘ రాజేంద్ర ప్రసాద్ ను చాలా దగ్గర నుండి చూశాను.
ఆయనకి చాలా కోపం ఎక్కువని చాలా మంది చెబుతారు. నాకు తెలిసి ఆయన తప్పేమి ఉండదు. షాట్ 9 గంటలకని చెప్పి .. 12 గంటలైనా తీయకపోతే కోపం రాదా? కాస్ట్యూమ్స్ తాను అనుకున్నట్టుగా లేకపోతే కోపం రాదా? అలాంటి సంఘటనలను పెద్దవి చేసి ప్రచారం చేశారంతే..!’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు రేలంగి నరసింహారావు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!