ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో ఎక్కువమంది చర్చించుకుంటున్న అంశం.. ఫేక్ కలక్షన్స్. ఇటీవల విడుదలైన రెండు సినిమాల వసూళ్లకు సంబంధించే ఆ చర్చంతా. ఒక సినిమా బాలీవుడ్‌ది అయితే, రెండో సినిమా టాలీవుడ్‌ది. తెలుగు సినిమాకు సంబంధించి ఆ సినిమాను రిలీజ్ చేసిన నిర్మాతనే ‘మేం ఫ్యాన్స్ కోసం కలక్షన్లు చెప్పాం’ అని తేల్చేయడంతో ఇక్కడ తేలిపోయింది. కానీ బాలీవుడ్‌లో తేలడం లేదు. తాజాగా ఈ విషయంలో ఆ బాలీవుడ్ సినిమా దర్శకుడు (Star Director) కూడా తన మాటను వినిపించారు.
Star Director
దీంతో ఈ విషయంలో ఇక్కడితో ఆగేలా లేదు అనిపిస్తోంది. అలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో దర్శకుడు వాసన్ బాలా (Vasan Bala) తెరకెక్కించిన సినిమా ‘జిగ్రా’ (Jigra) . ఈ సినిమా వసూళ్ల గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సినిమా వసూళ్ల విషయంలో నిర్మాణ సంస్థ తప్పుడు లెక్కలు చెబుతోందని.. థియేటర్లు ఖాళీగా ఉన్నాయని ప్రముఖ నటి దివ్యా ఖోస్లా కుమార్ (Divya Khosla Kumar) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో దివ్యా ఖోస్లా కుమార్‌కు ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్లు పడుతున్నాయి.
తొలుత నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) సోషల్ మీడియాలో ఓ కామెంట్ పెట్టి కౌంటర్ ఇచ్చాడు. అయితే ఆ కౌంటర్ ఆమెకేనా అనేది తెలియదు. ఇప్పుడు దర్శకుడు వాసన్ బాలా రియాక్ట్ అయ్యారు. ఫేక్ బుకింగ్స్, కలెక్షన్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఈ విమర్శలకు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే సమాధానం ఇవ్వగలరు. వసూళ్లపై ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మరోవైపు ఈ సినిమా ‘సవి’ అనే దివ్యా ఖోస్లా కుమార్ సినిమాకు కాపీ అంటూ తొలుత విమర్శలు వచ్చాయి. దాని గురించి కూడా వాసన్ బాల రియాక్ట్ అయ్యారు. ‘జిగ్రా’ సినిమా కాపీ మూవీ కాదని.. తమ సినిమా షూటింగ్ పూర్తయి ఎడిటింగ్ పనుల్లో ఉండగా ‘సవి’ విడుదలైంది అని ఆయన తెలిపారు. మరి ఈ విషయంలో దివ్య ఖోస్లా కుమార్ ఏమంటారో చూడాలి.