Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఎన్టీయార్ బయోపిక్స్ ఆపండి అంటూ ఓ అభిమాని ఆక్రోశం!

ఎన్టీయార్ బయోపిక్స్ ఆపండి అంటూ ఓ అభిమాని ఆక్రోశం!

  • October 26, 2017 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీయార్ బయోపిక్స్ ఆపండి అంటూ ఓ అభిమాని ఆక్రోశం!

ఎన్టీయార్ బయోపిక్స్ అంటూ.. జరుగుతున్న పరిణామాలు నిజంగా బాధాకరం. నిజమైన అన్నగారి అభిమానులను ఈ పరిణామాలు వేదనకు గురి చేస్తున్నాయ్. కారణజన్మునిగా జనం చేత జేజేలు అందుకున్న మహానుభావుడు జీవితం కొందరు స్వార్థపరులకు ఆట వస్తువుగా మారడం శోచనీయం.

ఏ నక్షత్రంలో జన్మించాడో కానీ.. పుట్టినప్పటి నుంచి ఎన్టీయార్ చేతిని ఆ భగవంతుడు విడచిపెట్టలేదు. తనతోటే ఆయన్ను నడిపించాడు. తనంతవాడ్ని చేసి… చివరి రోజుల్లో చేయి వదిలేశాడు. అక్కడ్నుంచి ఆయన జీవితం విషాదకరమే. ఇవి అందరికీ తెలిసిన నిజాలే. ఆమాటకొస్తే.. నేటితరానికి కూడా తెలుసు. ప్రత్యేకించి మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదు. నిజానికి ఆ వ్యవహారం పూర్తిగా తెలిసిన మనుషులు ఇద్దరు. వారే చంద్రబాబు, లక్ష్మీపార్వతి. వాళ్లు కూడా నిజాలను నిర్భయంగా చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు సినిమాలు తీసి ఉపయోగం ఏంటి? ఎన్టీయార్ ఆత్మను క్షోభింపజేయడం తప్ప.

కర్ణుడికి మరణానికి ఎన్నో కారణాలు. ఎన్టీయార్ విషయంలో కూడా అంతే. కొందరి స్వార్థానికి ఆయన బలైపోయారు. అలాగే… స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయ్. అవి కూడా ఆయన్ను బలితీసుకున్నాయ్. సో.. వాటిని మళ్లీ తెలుసుకున్నంతమాత్రాన ఎవరికీ ఒరిగేది లేదు. చివరకు ఆ విషాదాన్ని కూడా అడ్డుపెట్టుకొని బావుకుందాం అని చూడడం.. నీచమైన చర్యే. క్షమించకూడని చర్య.rgv-ntr-biopic

బాలకృష్ణ తన తండ్రి కథను సినిమాగా తీయాలనుకున్నాడు. నిజానికి ఎన్టీయార్ లాంటి మహనీయుని జీవితం నేటి తరానికి ఆదర్శం. దాన్ని సినిమాగా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే… సమాజానికి కావాల్సింది అన్నగారి పోరాటం మాత్రమే. నిమ్మకూరులో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు… ఇంతింతై వటుడింతై అన్న చందాన… మహాశక్తిగా ఎదగడం.. తెలుగు సినిమాను 35 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలడం.. ఎదురులేని సూపర్ స్టార్ గా నిలవడం.. నటనకు కొత్త భాష్యం చెప్పడం… తెలుగు ప్రజలందరూ తమ తల్లిదండ్రుల తర్వాత అంతగా ఆరాధించే వ్యక్తిగా ఎదగడం.. ఇది నేటి తరానికి తెలియాల్సింది. 9 నెలల్లో పార్టీ పెట్టి.. ఏ విధంగా దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీని మట్టి కరిపించాడో నేటి తరానికి తెలియాలి. మదరాసీలు అని పిలవబడుతున్న తెలుగువాళ్లకు ఏ విధంగా ఓ గుర్తింపునిచ్చాడో తెలియాలి. ఇవి ఎన్టీయార్ బయోపిక్ ద్వారా నేటి సమాజానికి తెలియాల్సింది. అంతేకానీ… చివరి రోజుల్లో ఆయన ఎదుర్కొన్న పరిణామాలు నేటి సమాజానికి అనవసరం.

నిజానికి రామ్ గోపాల్ వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ప్రకటించిన వెంటనే… లక్ష్మీపార్వతి దాన్ని ఖండించి ఉండాల్సింది. కానీ.. ఆమె సపోర్ట్ చేసింది. తన భర్త చివరి రోజుల్లో జరిగింది అందరికీ తెలియాలి… అని మీడియా సాక్షిగా అంది. ఇప్పుడు ఆమె కథనే సినిమాగా తీయడానికి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సిద్ధపడేసరికి… ‘ఇది అన్యాయం..’ అంటూ ఎన్టీయార్ ఘాట్ వద్ద నిరసనకు దిగింది. తీస్తే తీవ్ర పరిణామాలుంటాయ్ అని హెచ్చరించించింది కూడా. అంటే.. నీళ్లు తన కిందకొస్తే కానీ… అర్థం కాకపోతే ఎలా?

‘భారతరత్న’ అందుకోదగ్గ మహనీయుడు ఎన్టీయార్. తెలుగువారి అద్భుత జ్ఙాపకం ఆయన. ఎన్టీయార్ అంటే… తెలుగోడి ఆస్తి. భౌతికంగా మనకు దూరమైన ఆ గొప్పవ్యక్తిని బయోపిక్ ల పేరుతో మళ్లీ మళ్లీ చంపడం నిజంగా దారుణం. ఈ దురాదగతాలకు ఇకనైనా స్వస్తి పలకండి.. ప్లీజ్.teja-ntr-biopic

మళ్లీ మళ్లీ చెబుతున్నాను… పుజనీయుల జీవితాల్లో కూడా చిన్న చిన్న లోపాలు సహజం. వారి గొప్పతనం భావితరాలకు కావాలి తప్ప.. వారి లోపాలు అనవసరం. వారి జీవితాలపై రంధ్రాణ్వేషణ చేస్తే… రంధ్రాలే మనకు మిగులుతాయ్. వారి గొప్పతనాన్ని ప్రభోదిస్తే.. అది భావితరాలకు ఆదర్శం అవుతుంది. ఇకనైనా.. ఈ బయోపిక్ ల రచ్చ ఆపండి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Teja
  • #Kethireddy Jagadishwar Reddy
  • #NTR
  • #NTR biopic
  • #Ram Gopal Varma

Also Read

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Rgv: రాజమౌళికి సపోర్ట్ గా ఆర్జీవీ సంచలన ట్వీట్…. హారర్ మూవీ తీయాలంటే దెయ్యంగా మారాలా…?

Rgv: రాజమౌళికి సపోర్ట్ గా ఆర్జీవీ సంచలన ట్వీట్…. హారర్ మూవీ తీయాలంటే దెయ్యంగా మారాలా…?

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

Siva: 36 ఏళ్ల తర్వాత రివీల్‌ అయిన ‘శివ’ సీక్రెట్‌.. ఏ సినిమాను చూసి రాశారంటే?

Siva: 36 ఏళ్ల తర్వాత రివీల్‌ అయిన ‘శివ’ సీక్రెట్‌.. ఏ సినిమాను చూసి రాశారంటే?

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

trending news

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

3 days ago
Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

3 days ago
Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

3 days ago
Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

NBK 111: బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

NBK 111: బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

3 mins ago
Mahesh Babu P: ఆ వయసులో అలా చేసేశా.. కోలుకోవడానికి పదేళ్లు పట్టింది.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Mahesh Babu P: ఆ వయసులో అలా చేసేశా.. కోలుకోవడానికి పదేళ్లు పట్టింది.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

21 mins ago
Allu Arha: చిన్న వయసులోనే “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు” లో అల్లు అర్హ…..!

Allu Arha: చిన్న వయసులోనే “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు” లో అల్లు అర్హ…..!

3 hours ago
SPIRIT: ‘స్పిరిట్’ యూనివర్స్.. ఆశలు బానే ఉన్నాయి కానీ ఆ లాజిక్ మిస్సయ్యారు!

SPIRIT: ‘స్పిరిట్’ యూనివర్స్.. ఆశలు బానే ఉన్నాయి కానీ ఆ లాజిక్ మిస్సయ్యారు!

16 hours ago
DEVARA 2: ‘దేవర’, ‘వీరమల్లు’ భవిష్యత్తు ఏంటి? సీక్వెల్స్ ఆగిపోయాయా?

DEVARA 2: ‘దేవర’, ‘వీరమల్లు’ భవిష్యత్తు ఏంటి? సీక్వెల్స్ ఆగిపోయాయా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version