ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఏ దర్శకుడితో చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముగ్గురు, నలుగురు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ ఈ వరుసలో ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నారు. ఎన్టీఆర్ మాత్రం ఎవరితో సినిమా చేయాలి అనేది ఆర్ ఆర్ ఆర్ ఫలితం తరువాత నిర్ణయించుకుందాం అని చూస్తున్నారు. ఆ మూవీ విడుదల తర్వాత ఆయన పాత్రకు వచ్చిన స్పందన, ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కథ నిర్ణయించుకోవాలని ఆయన ఆలోచన. ఒక వేళ బాహుబలి స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ భారీ విజయం సాధిస్తే ఆయన నెక్స్ట్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో, యూనివర్సల్ కథను ఎంచుకునే అవకాశం కలదు. కాబట్టి ఎన్టీఆర్ దర్శకుడు, కథ విషయంలో తొందరపడటం లేదు.
ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ మరో స్థాయికి చేరడం ఖాయం. కాబట్టి ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం అంటే ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించే అవకాశం దక్కినట్లే. అందుకే టాలీవుడ్ దర్శకులతో పాటు సౌత్ ఇండియా ఫేమస్ డైరెక్టర్స్ ఆయనతో సినిమా చేయడానికి ఆరాటపడుతున్నారు. మరి ఎన్టీఆర్ ఆ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి ఇస్తారో చూడాలి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం 2021 జనవరి 8న విడుదల కానుంది.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!