పుష్ప 2 ముందు ఆర్ఆర్ఆర్ సినిమాని తీసి పారేసిన ఫిల్మ్ క్రిటిక్.. ట్వీట్ వైరల్!

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూలు సాధించింది. ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రూ. 360 కోట్లు కొల్లగొట్టింది. కేవలం బాలీవుడ్ లోనే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పుష్ప సినిమా మంచి సక్సెస్ సాధించటంతో పుష్ప 2 సినిమా మీద కూడా మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పుష్ప 2 సినిమా అన్ని భాషల రైట్స్ కి అల్లు అర్జున్ రూ. 1050 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాలీవుడ్ వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశాడు.

ఆర్ ఆర్ ఆర్ రైట్స్ కేవలం రూ. 750 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 కోసం వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తుందంటూ పుష్ప2 సినిమా ముందు ఆర్ఆర్ఆర్ సినిమాని చులకన చేస్తూ ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప 2 సినిమానే బెస్ట్ అల్లు అర్జున్ ఉద్దేశం అంటూ కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.vఅయితే నిజంగా పుష్ప 2 మేకర్స్ ఆ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారా ? లేదా? అన్న విషయం గురించి స్పష్టత లేదు.

పుష్ప 2 మేకర్స్ టార్గెట్ వెయ్యికోట్ల వసూళ్లు అనే వార్త ప్రచారంలో ఉంది. కేవలం రైట్స్ కోసమే భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారన్న వార్త తెలియటంతో ఇక వసూళ్ల విషయంలో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పుష్ప సినిమా మంచి హిట్ అవ్వటంతో పుష్ప 2 విషయంలో దర్శకుడు సుకుమార్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags