స్టార్ హీరో కు తప్పని చిక్కులు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడుగా..!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‏వీర్ సింగ్ నగ్నంగా చేసిన ఓ ఫోటో షూట్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన సంగతే. ఆయన వస్త్రధారణే చిత్ర విచిత్రంగా ఉంటుంది.అలాంటిది ఆయన బట్టలు లేకుండా ఓ ప్రముఖ మ్యాగ్జైన్ కోసం ఫోటో షూట్ చేశాడు.దీంతో అతని పై తీవ్ర ప్రతికూలత ఏర్పడింది. ట్రోలింగ్ అనేది అతనికి సర్వసాధారణమైన విషయమే..! కానీ నగ్న ఫోటోల వ్యవహారం కోర్టులో కేసు వేసే వరకు వెళ్ళింది.మహిళా సంఘాలు వంటివి గోల చేసేస్తున్నాయి.

యువతను తప్పుదారి పట్టించే విధంగా రణ్ వీర్ వ్యవహార శైలి ఉందంటూ వారు మండిపడ్డారు.మానవ హక్కుల సంఘాలు సైతం ఈ విషయం పై గోల చేస్తున్నాయి. రణ్ వీర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, టాలీవుడ్ హీరో నందు వంటి వారు కూడా నగ్నంగా ఫోటో షూట్లలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ వివాదం విషయంలో రణ్ వీర్ ముంబయిలోని చెంబూరు పోలీసుల ముందు హాజరయ్యారు.

ఈ విషయంపై పోలీసులు … రణ్ వీర్ ను చాలా సేపు విచారించారట.కానీ రణ్ వీర్ మాత్రం ఎటువంటి భయాలు పెట్టుకోకుండా పోలీసులకు సహకరించినట్టు తెలుస్తుంది. ఆ ఫోటో షూట్ గురించి ఆయన తన వాంగ్మూలాన్ని రాతపూర్వకంగా సమర్పించినట్టు తెలుస్తుంది. ఇంకేమైనా వివరాలు కావాలంటే తాను మళ్ళీ విచారణకి హాజరవ్వడానికి సిద్ధమని రణ్ వీర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చినట్టు సమాచారం.

రణ్ వీర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడం కోసం పోలీసులకు రెండు గంటల పైనే సమయం పట్టినట్టు తెలుస్తుంది. నిజానికి ఆగస్టు 22 నే విచారణకు హాజరు కావాలని పోలీసులు సమన్లు జారీ చేయగా… తనకు కొంత సమయం కావాలని రణ్ వీర్ కోరడంతో ఆగస్టు 30 వరకు అతనికి సమయం ఇచ్చారని తెలుస్తోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus