బిగ్ బాస్ హోస్ట్ చేయడానికి రూ.1000 కోట్లా నమ్మేలా లేదే..!

బిగ్గెస్ట్‌ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నార్త్ లో ప్రారంభమయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న ఈ షో తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యింది. సినీ పరిశ్రమకి, మోడలింగ్ రంగానికి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను, సింగర్స్ ను ఇలా వివిధ విభాగాలకు చెందిన వారిని కంటెస్టెంట్లుగా తీసుకొచ్చి… ఓ ఇంట్లో పెట్టి వారి ఎమోషన్స్ ను బయటకు తీసి ఎంటర్టైన్మెంట్ అందించడమే ఈ బిగ్ బాస్ షో యొక్క ప్రధాన ఉద్దేశం.

ఈ షో ద్వారా ఎమోషన్స్ ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ గెలవాలి అన్న మెసేజ్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో అయితే 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి.ఓటీటీ కోసం బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా స్టార్ట్ చేశారు. కానీ అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు 6వ సీజన్ కు రంగం సిద్ధమైంది. అయితే హిందీలో ఏకంగా 15 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 16వ సీజన్‌కు రంగం సిద్దమవుతుంది. ఆల్రెడీ కంటెస్టెంట్ ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఈ షో ని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుండడంతో దీనికి ఆదరణ పెరిగింది. సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్ లతో సరదాగా కబుర్లు చెబుతూ మరోపక్క వాళ్ళు చేసిన తప్పులకి క్లాస్ పీకుతూ ప్రేక్షకులకు కావాల్సిన ఆనందాన్ని అందిస్తున్నాడు. సల్మాన్ హోస్ట్ చేస్తున్నాడు కాబట్టే ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. స్టార్ హీరో కాబట్టి సల్మాన్ ఖాన్ కాల్ షీట్లు కూడా బాగా కాస్ట్ లీ.

గత సీజన్ కు ఒక్కో ఎపిసోడ్ కు అతను రూ.16 కోట్లు పారితోషికం అందుకున్నాడని భోగట్టా. నెలకి 4 రోజులు షూటింగ్ చేస్తే అతనికి రూ.64 కోట్ల వరకు వస్తుంది. శని, ఆది వారాల షూటింగ్ సెపరేట్ గా జరిగితే రూ.128 కోట్లు అవుతుంది. అప్పుడు 3 నెలలకు కలుపుకుని రూ.350 కోట్ల పైనే ఉండొచ్చు. అయితే ఇప్పుడు సీజన్ 16 కోసం అతను ఫుల్ ప్యాకేజీగా రూ.1000 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. ఇది ఓ విధంగా అతిశయోక్తి అనిపిస్తుంది. మరి నిజమో కాదో క్లారిటీ రావాల్సి ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus