అభిమాన హీరోను కలవడానికి.. ఇంటి ముందు నాలుగు రోజులు పడిగాపులు..!

అభిమాన హీరో కోసం వందల కిలో మీటర్లు సైకిల్‌ యాత్రలు వచ్చిన ఫ్యాన్స్‌ని చూసి ఉంటారు. మన దగ్గర కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారు. తాజాగా ఇలాంటి ఫ్యాన్‌ ఒకరు బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ను కలిశాడు. ఈ మేరకు ఓ ఫొటో, ఆయన స్పందన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆ ఫ్యాన్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడ గమనార్హం. హృతిక్‌ రోషన్‌పై (Hrithik Roshan) తన ప్రేమను విభిన్నంగా చాటుకున్నాడు హరియాణాకు చెందిన ఓ వ్యక్తి. కొన్నిరోజుల పాటు హీరో ఇంటి దగ్గర ఎదురుచూసి..

Hrithik Roshan

చివరకు అభిమాన హీరోతో ఫొటో దిగి మురిసిపోయాడు. హరియాణాలోని ఫరియాబాద్‌కు చెందిన జాదు (ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లోని పేరు ఇది) అనే వ్యక్తికి హృతిక్‌ అంటే ఇష్టం. ఈ విషయాన్ని తెలియజేసేలా తరచూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు కూడా. అలా కొన్ని రోజుల క్రితం తన అభిమాన హీరో హృతిక్‌ రోషన్‌ను కలవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కొన్ని రోజుల క్రితం తన గ్రామం నుండి ముంబయికి సైకిల్‌పై ప్రయాణం స్టార్ట్‌ చేశాడు.

దాదాపు వెయ్యి కిలో మీటర్లు ప్రయాణించి హృతిక్‌ ఇంటికి వచ్చాడు. హృతిక్‌ని కలవడం కోసం ఇంటి ముందు నాలుగు రోజులుగా వెయిట్‌ చేశాడు. ఆఖరికి విషయం తెలుసుకున్న హృతిక్‌ అతడిని కలిశాడు. కారు నుండి ఇంటి బయటకు వస్తుండగా ఫ్యాన్‌ని చూసి.. దగ్గరకు పిలిచి కాసేపు మాట్లాడి ఫొటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఉన్న లుక్‌ చూస్తే..

హృతిక్‌ (Hrithik Roshan) సూపర్‌ హిట్‌ సినిమా ‘కోయి మిల్‌గయా’లో (Koi… Mil Gaya) ఏలియన్‌లా కనిపిస్తోంది. ఆ లుక్‌ను ఫ్యాన్‌ రీ క్రియేట్‌ చేసినట్లు తెలుస్తోంది. హృతిక్‌ సినిమాల సంగతి చూస్తే… ‘ఫైటర్‌’తో (Fighter) ఈ ఏడాది ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు ‘వార్‌ 2’ కోసం పని చేస్తున్నాడు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేస్తారు.

 ‘గేమ్ ఛేంజర్’ లో ఆ ఫైట్ మెగా ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ తెప్పిస్తుందట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus