బర్త్ డే పార్టీలో మాజీ లవర్ ను ముద్దు పెట్టుకున్న స్టార్ హీరో.. వైరల్ అవుతున్న వీడియో!

సినిమా వాళ్ళు పబ్లిక్ ఈవెంట్స్ లో హగ్గులు పెట్టుకోవడం కామన్. ఈ విషయంలో బాలీవుడ్ ఒక అడుగు ముందు ఉంటుంది. ఏకంగా ముద్దులు కూడా పెట్టేస్తుంటారు వాళ్ళు. నిన్న.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 57వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ నివాసంలో సల్లు భాయ్ బర్త్ డే పార్టీనీ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్లు అందరూ విచ్చేసి సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

జాన్వీకపూర్, పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్ ఆర్యన్ సహా వంటి వారు ఈ వేడుకలో పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నాడు. సల్మాన్- షారుఖ్ ల కాంబో కి స్పెషల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ మాజీ లవర్ సంగీతా బిజ్ లని కూడా హాజరయ్యింది.

ఆమెతో సల్మాన్ ఖాన్ కాసేపు ముచ్చటించి తర్వాత ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అక్కడ ఉన్న వారంతా కూడా ఇది చూసి షాక్ అయ్యారు. అంతేకాదు సంగీత అంటే ఇప్పటికీ ప్రేమ ఉన్నట్టు సల్మాన్ ఖాన్ మాట్లాడాడట. అంతేకాదు ఆమె వెళ్తున్నప్పుడు కూడా సంగీత కారు డోర్ తీసి మరీ ఆమెను సాగనంపాడట. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus